Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
ప్రస్తుత దాంపత్య జీవితంలో టాక్స్‌క్ రిలేషన్‌షిప్‌లు తీవ్ర ఇబ్బందులను తెచ్చుపెడుతోంది. సంతోషంగా ఉందామని ప్రేమించుకున్న జంటలు, పెళ్లిచేసుకున్న జంటలు టాక్సిక్ రిలేషన్‌ల వల్ల విడిపోతున్నారు. టాక్సిక్ రిలేషన్స్ ఇప్పుడు కుటుంబాల్లో ఉన్న ప్రధాన సమస్య. ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్‌ల గురించి మరిన్ని విషయాలను అందిస్తున్నాం.
మీరు ఉన్న రిలేషన్‌షిప్‌లో మిమ్మల్ని కించపరచం, గాయపరచడం, మిమ్మల్ని పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేస్తే అది విషపూరితమైన సంబంధంగా చెప్పుకుంటాము. అలాంటి టాక్సిక్ సంబంధాల్లో మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి మీకు మేము సేకరించిన కొన్ని సంకేతాలను మీకు అందిస్తున్నాము.
హద్దులు లేకుండా విమర్శలు
మీ పార్ట్‌నర్ మిమ్మల్ని హద్దులు లేకుండా విమర్శిస్తూ ఉండడం. అందరి ముందు మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడం, మీరు బాధపడతారని తెలిసి కూడా మిమ్మల్ని బాధకు గురిచేయడం వంటివి చేస్తే మీకు టాక్సిన్ రిలేషన్‌లో ఉన్నారని అర్ధం.
ప్రతీ విషయంలో జోక్యం
మీ ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటారు. మీకు కొంత కూడా స్వేచ్ఛను ఇవ్వకుండా పూర్తిగా మీపై అధికారాన్ని చూపుతారు. మీరు ఓ బానిసనా అనే భావన వచ్చేంతలా మీ అంతర్గత విషయాల్లోకి చొచ్చుకొని వస్తారు. మీ అభిప్రాయాలకు అస్సలు విలువ కూడా ఇవ్వరు. ఇది కూడా టాక్సిక్ రిలేషన్‌కు సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఎమోషన్స్
మీ ఎమోషన్స్‌కు ఎట్టిపరిస్థితుల్లో గౌరవం ఇవ్వరు. కావాలని మీతో నచ్చని పనులను చేయిస్తారు.
తరచుగా గొడవలు
మీతో తరచుగా గొడవపడుతుంటారు. గొడవను తగ్గించకుండా మరింత పెంచేలా వారి ప్రవర్తన ఉంటుంది. టాక్సిక్ రిలేషన్‌లో ఉన్నవారు నిత్యం గొడవపడుతూ ఉంటారు.
సహకార లోపం
భార్యాభర్తలిద్దరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఉండాలి. అలాంటి సపోర్ట్ ఇద్దరిలో కనిపించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవ్వరి ఆరోగ్యం, మానసిక పరిస్థితి సరిగా లేకున్నా సహకరించుకుంటూ ఉండాలి. అలా లేకపోతే ఇది కూడా టాక్సిక్ రిలేషన్‌కు సంకేతంగా చెప్పుకోవచ్చు.
నచ్చని పనులు
మీ జీవిత భాగస్వామికి నచ్చని పనులను కావాలనే చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా వారిపై మానసికంగా దాడి చేస్తూ ఉంటారు.
కమ్యునికేషన్‌లో గొడవలు
మీ ఇద్దరి మధ్య కమ్మునికేషన్ సరిగ్గా లేకపోవడం. ఒక సందర్భంలో జరిగినా అది తీవ్ర గొడవలకు, అవమానాలకు దారి తీసి, మిమ్మల్ని ఏమి మాట్లాడనీయకుండా చేస్తే ఇక మీరు టాక్సిక్ రిలేషన్‌లో ఉన్నట్లేనని నిర్ధారణకు రావచ్చు.
సంతోషం లోపించడం
రిలేషన్‌షిప్‌లో ఎంతసేపు ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేకపోవడం. తరచుగా ఇద్దరిమధ్య వాదనలు, టెన్షన్, అసంతృప్తి చోటుచేసుకుంటే దాన్ని కూడా టాక్సిక్ రిలేషన్‌కు సంకేతంగా భావించవచ్చు.
పొససివ్‌నెస్
మీపైన విపరీతమైన పొససివ్‌నెస్‌ను కలిగి ఉంటారు. మిమ్మల్ని స్నేహితులతో, బయట సమాజంతో ఎక్కవ కలవనీయకుండా చేస్తే మీరు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లేనని అనుకోవాచ్చు.
కారణం లేకుండా అనుమానం
మిమ్మల్ని పదే పదే ఎలాంటి కారణాలు లేకుండా అనుమానిస్తున్నప్పుడు. అప్పుడు నమ్మకానికి చోటు ఉండదు. అలాంటి పరిస్థితి కూడా టాకిక్ రిలేషన్‌షిప్‌కు సంకేతంగా చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications