Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
భాగస్వామి తోడుగా వస్తారు కానీ మీ భారాన్ని మోయలేరు!..మీరెలా ఉండాలంటే..
జీవితంలో ఒక మంచి జీవిత భాగస్వామి దొరికితే మన ప్రయాణం ఎంతో అందంగా, సాఫీగా సాగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెద్దలు, రిలేషన్ షిప్ కోచ్ లు తరచుగా ఈ విషయం చెబుతూ ఉంటారు. తోడుగా ఒకరు ఉన్నారన్న భరోసా మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.
అయితే ప్రేమ, పెళ్లి, బంధాల విషయంలో చాలామంది ఒక పెద్ద భ్రమలో బతుకుతుంటారు. తమ జీవితంలోకి వచ్చే పార్టనర్ దగ్గర తమ కష్టాలన్నింటికీ ఒక మాయాజాలం లాంటి పరిష్కారం ఉంటుందని, వాళ్లు రాగానే తమ జీవితం పూలపాన్పులా మారిపోతుందని ఆశిస్తుంటారు. కానీ ఇక్కడే మనం ఒక నగ్న సత్యాన్ని గ్రహించాలని ప్రముఖ రిలేషన్ షిప్ కోచ్ విజయ పెద్దిన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్న ఓ వీడియో ద్వారా వివరించారు.

ఒక మంచి పార్టనర్ తో ఉంటే మన లైఫ్ ఈజీగా ఉంటుంది అనేది నిజమే. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే.. వాళ్లు మన ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడానికి మన జీవితంలోకి రాలేదు అని విజయ పెద్దిన చెప్పారు.
నిన్ను నువ్వే కాపాడుకోవాలి..
మన జీవితం అనేది మన సొంత పుస్తకం లాంటిది. అందులోని కష్టనష్టాలు, ఆటుపోట్లు మనమే స్వయంగా ఎదుర్కోవాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి అన్నది విజయ పెద్దిన గారి మాటల్లోని ఆంతర్యం. మన మనసులోని ఆరాటం, మన భయాలు, మన గతానుభవాలు.. ఇవన్నీ ఎవరికీ పూర్తిగా అర్థం కావు. కాబట్టి మనకు ఏది అవసరమో, మనం ఎలా మారితే బాగుంటుందో మనమే తెలుసుకోవాలి.
మనం ఏంటో మనకు తెలియాలి..
ఏ బంధంలో అయినా మనం సంతోషంగా ఉండాలంటే ముందుగా 'మనం ఏంటి?' అనేది మనకు స్పష్టంగా తెలియాలి. మన లక్ష్యాలు ఏంటి? మన కోరికలు ఏంటి? మనకున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? మనలో ఉన్న లోపాలు ఏంటి? మన మీద మనం ఎక్కడ వర్క్ చేయాలి? భవిష్యత్తులో మన ప్రయాణం ఎటువైపు వెళ్లాలి? అనే విషయాలపై మనకంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనమే వెతుక్కోవాలి. మన ప్రయాణానికి రూట్ మ్యాప్ మనమే గీసుకోవాలి.
వాళ్లు తోడుగా వస్తారు.. మోయలేరు!
మన దారి ఏంటో మనకు తెలిసినప్పుడు, మన లక్ష్యం ఏంటో మనం డిసైడ్ చేసుకున్నప్పుడు.. మన భాగస్వామి ఆ ప్రయాణంలో మనకు తోడుగా, చేదోడువాదోడుగా నిలుస్తారు. మీరు అలిసిపోయినప్పుడు ఓదార్పునిస్తారు, మీరు కిందపడినప్పుడు చెయ్యి పట్టి పైకి లేపుతారు, మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు.
అంతేకానీ మీ ప్రయాణం మొత్తం వాళ్లే చేయాలి, మీ బాధ్యతల భారం మొత్తం వాళ్ల మీదే వేసేసి, వాళ్లే మిమ్మల్ని జీవితాంతం తమ భుజాలపై మోయాలి అనుకుంటే మాత్రం.. మీరు కరెక్ట్ గా ఆలోచించట్లేదేమో ఒక్కసారి గమనించుకోవాలి.
ఎదుటి వ్యక్తి కూడా ఒక మనిషే అని, వారికి కూడా సొంత ఆలోచనలు, సమస్యలు, భావోద్వేగాలు ఉంటాయని మనం గుర్తించాలి. మన లోపాలను, మన సమస్యలను వారి నెత్తిన రుద్దడం వల్ల బంధంలో క్రమంగా దూరం పెరుగుతుంది తప్ప ప్రేమ పెరగదు. ఈ అధిక అంచనాలే చాలా బంధాలు ముక్కలు కావడానికి ప్రధాన కారణం అవుతున్నాయి.

మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి
చివరగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే.. మీ జీవితానికి మీరే హీరో లేదా హీరోయిన్. ఎవరైనా సరే మీకు సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. కాబట్టి మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. మీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ పైన మీరే వర్క్ చేయండి. ఆ ప్రాసెస్ లో మీ పార్టనర్ కచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. మీ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తారు. కానీ వాళ్లు మిమ్మల్ని పూర్తిగా మార్చేయలేరు, ఫిక్స్ చేయలేరు.
ఇద్దరు వ్యక్తులు ఎవరికి వారు పరిపూర్ణంగా ఉంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టాల్లో మరొకరు అండగా నిలబడే బంధమే కలకాలం నిలుస్తుంది. మీ భారాన్ని మీరే మోస్తూ, పక్కన నడిచే పార్టనర్ చేతిని ఆప్యాయంగా పట్టుకుని సాగే ప్రయాణమే అత్యంత అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications