Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
16 samskaaraas: పుట్టుక ముందు నుంచి చావు వరకు..హిందూమతంలోని 16 ముఖ్య ఆచారాలివే
హిందూ మతంలో సంస్కారాలకు లేదా ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. జననం నుండి మరణం వరకు అనేక రకాల కర్మలు ఉన్నాయి. హిందూ మతంలో పుట్టిన రోజు నుంచి చావు వరకు నిర్వహించే 16 ప్రధాన ఆచారాలు అతి ముఖ్యమైనవి. ఈ పదహారు సంస్కారాలను షోడశ సంస్కారం అని కూడా పిలుస్తారు.
గౌతమ శాస్త్రంలో 40 ఆచారాలు ప్రస్తావించబడ్డాయి. కానీ కొన్ని చోట్ల 48 ఆచారాలు కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ ప్రస్తుత కాలంలో 16 సంస్కారాలు మాత్రమే ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి. ఇవి మన జీవితాన్ని, మన విలువలను బాగా ప్రభావితం చేస్తాయి. ఆచారాల కోసం నిర్వహించే కార్యక్రమాలలో పూజ, యాగాలు, మంత్రోచ్ఛారణలు మొదలైన వాటికి కూడా శాస్త్రోక్తమైన ప్రాముఖ్యత ఉంది కాబట్టి జననం నుండి మరణం వరకు ఉండే ముఖ్యమైన 16 ఆచారాలు ఏవో తెలుసుకుందాం.

హిందూ మతంలోని 16 ప్రధాన ఆచారాలు
1. గర్భాదానం
ఇది సంస్కారాలలో మొదటిది.వివాహానంతరం సంతానం పొందాలనుకునే దంపతులకు ఇది మొదటి ఆచారం. మతపరమైన భావాలతో ఆరోగ్యకరమైన,సంస్కారవంతమైన బిడ్డ పుట్టాలని ప్రార్థించడం దీని ఉద్దేశం. స్త్రీ గర్భము వేదం మంత్రానుసారం యోగ్యతను సాధించుకునే ప్రక్రియ.నూతన దంపతుల యొక్క మనస్సు, శరీరం వేదమంత్ర సహితంగా శుద్ధి పరిచిన అనంతరం వధువు గర్భం దాల్చడానికి అర్హురాలు అవుతుంది.
2. పుంసవన్
పుంసవన్ అనేది హిందూ మతంలోని 16 సంస్కారాలలో ఒకటి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, భద్రత కోసం ఇది జరుగుతుంది. గర్భం యొక్క మూడవ లేదా నాల్గవ నెలలో ఇది నిర్వహిస్తారు. సాధారణంగా గర్భం కనిపించడం ప్రారంభించిన తర్వాత కానీ బిడ్డ కడుపులో కదలడం ప్రారంభించే ముందు ఆచారాన్ని జరుపుకుంటారు.
3. సీమంతోన్నయనం
దీనిని సీమంతం లేదా శ్రీ మంతం అని పిలుస్తాం.ఇది సునాయాసంగా ప్రసవం జరగడానికి ఉద్దేశించి చేసే ముఖ్యమైన కర్మ. గర్భం ధరించిన స్త్రీకి ఆనందం కలిగేలా ఒక పండుగలా జరపవలసిన కార్యక్రమం. గర్భిణీ స్త్రీ మనోధైర్యాన్ని పెంచడానికి, కడుపులో పిల్లల సరైన అభివృద్ధి కోసం ఇది జరుగుతుంది.
4. జాత కర్మ
ఇది బిడ్డ పుట్టిన వెంటనే నిర్వహించే ఒక ఆచారం. ఈ కర్మ శిశువు జన్మించడానికి కొద్ది సమయం ముందు మొదలై శిశువు జన్మించిన తర్వాత పూర్తవుతుంది. ఇందులో తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం శుభాకాంక్షలు తెలియజేయబడతాయి. ఇది శిశువు జీవితానికి నాందిగా పరిగణించబడుతుంది. శిశువు తండ్రి జాత అశౌచానికి పూర్వం అలాగే పురిటి స్నానం పూర్తి అయిన తర్వాత 11వ రోజున కూడా చాల రకాలైన దానాలు చేస్తారు.
5. నామకరణ వేడుక
ఈ వేడుక బిడ్డ పుట్టిన 11వ లేదా 12వ రోజున, ఆ బిడ్డకు పేరు పెట్టినప్పుడు నిర్వహిస్తారు. ఈ పేరు పెట్టడం అనేది గుర్తింపులో ఒక భాగం మాత్రమే కాదు.. జ్యోతిషశాస్త్ర కోణం నుండి కూడా ఇది ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
6. నిష్క్రమణం
శిశువు జన్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇంటి నుంచి బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చి బయటసమాజానికి, ప్రకృతికి అలవాటు పడటానికి ఈ కర్మ నిర్వహిస్తారు. ఇది సాధారణంగా నాలుగు నెలల తర్వాత శిశువును సూర్యుడు,చంద్రునికి పరిచయం చేసినప్పుడు జరుగుతుంది.
7. అన్నప్రాశన
6 నెలల వయస్సులో మొదటిసారిగా పిల్లలకి ఆహారం తినిపించే ఆచారం ఉంది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.
8. చౌల సంస్కార్
పిల్లల వయస్సు మొదటి సంవత్సరం చివరిలో లేదా మూడవ, ఐదవ లేదా ఏడవ సంవత్సరం పూర్తయినప్పుడు పుట్టినప్పుడు శిశువు తలపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఈ చర్యను ముండన్ సంస్కార్ అంటారు.కొంతమంది దీన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటాము.
9. కర్ణవేధ
కర్ణవేధ అంటే చెవులు కుట్టటం. ఈ ఆచారం భౌతిక, మతపరమైన దృక్కోణం నుండి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆడపిల్లలకి,మగపిల్లలకి ఇద్దరికీ చెవులు కుట్టటం చేస్తారు. ఆడపిల్లలకు మాత్రమే ముక్కు కుడతారు.
10. అక్షరాభ్యాసం
పదవ సంస్కారం అక్షరాభ్యాసం. మొట్టమొదటగా ఉచ్చరించడం రాయడం నేర్పిస్తారు. ఇది అందరికి అవసరమైన సంస్కారం.
11. ఉపనయనం
ఈ సంస్కారం ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తరగతులకు సంబంధించినది. దీనిని యజ్ఞోపవిత్ సంస్కార్ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లలను విద్య, అభ్యాస మార్గంలో తీసుకెళ్లడానికి చిహ్నం. ఇందులో తండ్రి తన తనయుడికి బ్రహ్మోపదేశ౦ చేస్తాడు. గురువు వటువుకు యజ్ఞోపవీత ధారణ చేస్తాడు. ఈ సంస్కారం ద్వారా వటువును.. గురువు దగ్గరికి చేర్చి నిజమైన,అలౌకికమైన జ్ఞానాన్ని గురువు ద్వారా పొందేందుకు తోడ్పడుతుంది.
12. కేశాంత
యుక్తవయస్సులో ఇది ఒక ఆచారం. దీనిని ముండన్ లేదా మొదటి గడ్డం షేవింగ్ చేసే ఆచారం అని కూడా అంటారు.
13. సంవర్తన లేక స్నాతక సంస్కారం
ఈ సంస్కారాన్ని విద్యార్ధి విద్యాభ్యాసం అనంతరం జరుపుతారు.ఈ సంస్కారాన్ని విద్యను బోధించిన గురువు జరిపి వటువు ను బ్రహ్మచర్యం నుండి గృహస్తాశ్రమం స్వీకరించమని ఆజ్ఞాపిస్తారు.
14. వివాహం
కుటుంబం, సమాజంలో వ్యక్తి పాత్రను నిర్ణయించే జీవితంలో అత్యంత ముఖ్యమైన సంస్కారం. ఇది జీవితంలో కొత్త దశకు నాంది పలికింది.
15. వానప్రస్థ (పదవీ విరమణ)
ఇందులో ఒక వ్యక్తి కుటుంబ జీవితం నుండి విముక్తి పొంది సామాజిక, ఆధ్యాత్మిక సేవ వైపు వెళతాడు.
16. చివరి కర్మలు
ఇది మరణానంతరం చేసే చివరి కర్మ. వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ కర్మలను నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications











