Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
బ్రహ్మచారైన హనుమంతుడికి పుత్రుడున్నాడా?
ఆశ్చర్యంగా ఉంది కదా? హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? ఈ విషయంపై ఈ ఆర్టికల్ లో చెప్పుకోబడిన అంశాలు ఏంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చదవండి మరి.
హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైనా శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. మహాభారతమనే హిందూ పురాణంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలెన్నో చెప్పబడ్డాయి. మహాభారతాన్ని చదువుతున్న కొద్దీ ఇటువంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మకరధ్వజ హనుమంతుడి కొడుగుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి. తండ్రీ కొడుకులిద్దరూ యుద్ధభూమిలో ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకోకుండా యుద్ధానికి దిగినపుడు ఏం జరిగింది. ఈ స్లైడ్ షో చూడండి

హనుమంతుడు, చేప
మహర్షి వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ది చెందిన కథనం ప్రకారం ఒకసారి హనుమంతుడు ఒక నదిలో స్నానమాచరిస్తుండగా అతని శరీరంలోనుంచి పుట్టిన వేడివల్ల అతని వీర్యం ఆ నదీజలాల గూండా ప్రయాణించి ఒక చేప లాంటి జీవి అయిన మకరలోకి చేరింది. ఆ తరువాత ఆ జీవి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత రావణుడి దాయాదులైన ఆహిరావణ, మహిరావణలు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలోనున్న ఈ బిడ్డని ఆ నదీతీరంలో కనుగొన్నారు. ఆ విధంగా మకరధ్వజ జన్మించాడు.

మకరధ్వజ : సాహసోపేతమైన యుద్ధవీరుడు
వాల్మీకి రామాయణం ప్రకారం, రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో, సగం వానరం, సగం చేప ఆకారంలోనున్న మకరమనే వాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు. హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడు.

విస్మయం చెందిన హనుమంతుడు
మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించాడు.

విశ్వాసపాత్రుడు
రాక్షసుల బారినుంచి రామలక్ష్మనులను రక్షించడానికి తనకు దారిని వదలమని తనను అడ్డుకోవద్దని హనుమంతుడు తన పుత్రుడినడుగుతాడు. అయితే, మకరధ్వజుడు హనుమంతుడికి దారివ్వడానికి అంగీకరించడు. తన తండ్రని తెలిసిన తరువాత కూడా హనుమంతుడికి అడ్డు తగులుతాడు. తన యజమాని అహిరావణ అజ్ఞను ధిక్కరించడానికి మకరధ్వజుడు అంగీకరించడు. రామలక్ష్మణులు బందీలుగానున్న చోటికి చేరుకునే మార్గం తెలుసుకునేందుకు హనుమంతుడికి ఒక సమస్యను పరిష్కరించమని అడుగుతాడు.

మచ్చాను
కాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు, హనుమంతుడి వీర్యం నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి. మరికొన్ని కథనాలు, లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువన్నమచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చారని అంటారు.

తండ్రీ కొడుకుల కలయిక
థాయ్, కేంబోడియాన్ రామాయణ కథనాల ప్రకారం రావణసైన్యంతో జరుగుతున్న ఒకానొక యుద్ధంలో హనుమంతుడు సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో కనిపించాడు. భీకర యుద్ధం తరువాత హనుమంతుడు తన వద్ద నున్న ఆయుధాలతో తన ప్రత్యర్థిని డీ కొనడానికి సంసిద్ధమవుతాడు. ఇంతలో, ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం మిల మిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైనా సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువన్నమచ్చ ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియచేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకరినొకరు గుర్తుపడతారు.



Click it and Unblock the Notifications