Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
దుష్ట శక్తులను ఇలా వదిలించుకోవచ్చు..! బొటనవేలుకు ఉంగరం పెట్టుకుంటే డేంజర్..!
మానసికంగా బలహీనంగా వుంటే బయట వున్న దుష్ట శక్తుల బారిన పడతారు. భక్తితో సాధించుకున్న శక్తులను దుర్వినియోగం చేసేవారు కూడా వున్నారు. వారు ఎవరికైనా మరణాన్ని కూడా కలిగించవచ్చు. ఈ దుష్ట శక్తుల గురించి నాలుగు వేదాల్లో ఒకటైన అథర్వనవేదంలో స్పష్టంగా వుంది. వారు ప్రయోగించే శక్తులు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీదే కాకపోవచ్చు, ఆ ప్రదేశంలో ఎవరు వున్నా వారిపై ఈ దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది.

కొన్ని సాధనలను పాటించడం వల్ల దుష్ట శక్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
రుద్రాక్ష ధరించడం
రుద్రాక్ష చెట్టు హిమాలయాల్లో ఎక్కువగా పెరుగుతుంది. 12వేల అడుగుల ఎత్తులో ఈ రుద్రాక్ష చెట్టు పెరుగుతుంది. ఈ రుద్రాక్షణు ఎవరైతే ధరిస్తారో వారి చుట్టూ ఒక ప్రత్యేకమైన రక్షణ కవచం వున్నట్టే. బయట శక్తులు అతన్ని ఇబ్బంది పెట్టవు. మీరు ఎక్కడికి వెళ్లినా ఆ శక్తికవచం మీతోనే వస్తుంది. కుటుంబం బాధ్యతలో ఎక్కువగా వున్నవారు పంచముఖీ రుద్రక్షను ధరించవచ్చు. రుద్రాక్షలతో పనిచేస్తున్న కుటుంబాలు వేల సంవత్సరాలుగా వున్నాయ్. వారు కేవలం డబ్బు కోసమే కాకుండా ఒక బాధ్యత భక్తితో పనిచేస్తుంటారు. వారి వద్ద నుంచి మాత్రమే రుద్రాక్షలను కొని వేసుకోవాలి.
బొటనవేలుపై ఉంగరాన్ని ధరించవద్దు
బొటనవేలుపై లోహపు ఉంగరాలను ధరిస్తే మీరు కొన్ని ప్రతికూల శక్తులను ఆకర్శించినవారౌతారు. అకారణంగా ఎదురుదెబ్బలను తింటారు. కొందరికి దెబ్బమీదదెబ్బ పడుతూనే వుంటుంది. ఇది ఈ ప్రతికూల శక్తులవల్లేనని చెప్పుకోవచ్చు. క్షుద్రవిద్యలు చేయాలనుకున్నవారు మాత్రమే ఎక్కువగా బొటనవేలుకి లోహపు ఉంగరాన్ని ధరిస్తూ వుంటారు.
లింగం ఆవరణలో కూర్చోవాలి
దయ్యం పట్టినట్లు ఎవరికైనా అనిపిస్తే వారు లింగం ఆవరణలో కూర్చోవాలి. ధ్యాన లింగం వీటన్నింటినీ నాశనం చేస్తుంది. క్షుద్ర శక్తులను ద్యానలింగం అదుపు చేస్తుంది, నాశనం కూడా చేస్తుంది. పౌర్ణమి లేదా అమావాస్య, ఏదో ఒకరోజు అక్కడ కూర్చొని వెళ్లండి.

దేవీ అనుగ్రహాన్ని తీసుకొని రదండి
అమ్మవారిని మీరు తలుచుకొని హృదయంలో పెట్టుకుంటే ప్రతికూల శక్తులు మీపై పనిచేయకుండా వుంటాయ్. సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా వుంటే కూడా ఎలాంటి దుష్టశక్తుల బారిన పడకుండా వుంటారు.
ధ్యానం చేయడం
ధ్యానం చేసే వారిపై క్షుద్ర శక్తుల ప్రభావం బలంగా ఏమీ వుండదు. అంతరంగంలో నిశ్చలంగా వున్న వ్యక్తిపై ప్రభావాన్ని చూపించలేవు. నిశ్చలతను మీ జీవితంలోకి తీసుకొని వస్తున్నారు. నిశ్చలంగా వుంటే ఎలాంటి ప్రతికూల శక్తులూ పనిచేయవు.
భావోద్వేగాల్లో సమతుల్యత లేకపోతే
ఆలోచనల్లో భావోద్వేగాల్లో బలంగా వుంటే ఈ శక్తులపట్ల ఆకర్శితం కాకుండా వుంటారు. నిర్ధిష్ట స్థాయి ఏకాగ్రతా దృఢ సంకల్పంతో వున్నట్టయితే ఈ విషయాలన్నీ చిన్న ఎత్తుపళ్లాల్లా అనిపిస్తాయ్. భావోద్వేగాల్లో నియంత్రణ గునుక లేకపోతే అప్పుడు ఆ దుష్ట శక్తులు మీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయ్.
ఆధ్యాత్మిక చింతన
ప్రతీరోజు ఆధ్మాత్మిక చింతన చేయాలి. అన్నీ మన చేతుల్లో వుండవనే భావాన్నికలిగివుండాలి. మన పరిమితిలో చేయగలిగినంత చేయాలి. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి, సమయం నష్టం కావడం తప్ప జరిగేది ఏమీ వుండదు. దుష్టశక్తులు ఇలాంటి పరిస్థితిలోనే బలంగా మనమీద పనిచేస్తాయ్. బలహీనంగా వున్న శరీరాన్నే దుష్ట శక్తులు, ఆత్మలూ ఎంచుకుంటాయన్న విషయాన్ని మరవద్దు.



Click it and Unblock the Notifications











