Latest Updates
-
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
అదృష్టం పొందాలంటే.. మీ రాశి ప్రకారం దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం..!
అదృష్టం, ఐశ్వర్యం పొందాలంటే..దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి ?
ఆస్ట్రాలజీ ప్రకారం.. దేవుడికి తమ రాశిని బట్టి ప్రసాదం సమర్పించడం వల్ల.. ఐశ్వర్యం, అదృష్టం పొందుతారట. పుట్టిన జాతకం ప్రకారం దేవుడిని పూజిస్తే.. మరింత ఎక్కువ సత్ఫలితాలు పొందుతారని పండితులు సూచిస్తున్నారు.
భక్తులు రకరకాల పూజలు, వ్రతాలు, నోములు చేసుకోవచ్చు. అలాగే దేవుడికి ప్రత్యేక ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించవచ్చు. అయితే.. మీ రాశిని బట్టి దేవుడికి ప్రత్యేకంగా.. మీకు కలిసివచ్చే పదార్థాలనే నైవేద్యంగా పెట్టడం వల్ల అదృష్టం, సంపద మీ సొంతమవుతాయి.

మరి మీ రాశిని బట్టి ఇష్ట దైవానికి ఎలాంటి స్వీట్స్, ఎలాంటి పండ్లను ప్రసాదంగా సమర్పించాలో తెలుసుకోండి. మంచి భవిష్యత్ ని పొందండి.

మేష రాశి
మేష రాశివాళ్లు.. పూజలు చేసినప్పుడు దేవుడికి దానిమ్మ పండు, లడ్డులను ప్రసాదంగా సమర్పించడం వల్ల అదృష్టం పొందుతారు.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు.. పూజలు, వ్రతాలు చేసేటప్పుడు దేవుడికి తెల్లటి స్వీట్స్ అంటే రసగుల్లా లాంటివి సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు పూజ చేసిన తర్వాత దేవుడికి కాజూ బర్ఫీ సమర్పించడం వల్ల అదృష్టం వరిస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు.. దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాత కోయా బర్ఫీ లేదా కొబ్బరి సమర్పించడం వల్ల సంపద పొందడమే కాకుండా.. కోరికలు నెరవేరుతాయి.

సింహ రాశి
సింహ రాశి వాళ్లు దేవుడికి బెల్లం లేదా బేల్ ఫ్రూట్ సమర్పిస్తే.. ఐశ్వర్యవంతులవుతారు. అలాగే సంతోషం పొందుతారు.

కన్యారాశి
కన్యారాశి వాళ్లు తులసి ఆకులు, పియర్ ఫ్రూట్, ఇతర గ్రీన్ ఫ్రూట్స్ ని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

తులారాశి వాళ్లు
మీ ముఖంలో దాగి ఉండే 10 ఆరోగ్య సమస్యలు
దేవుడికి తులారాశి వాళ్లు యాపిల్స్ ని నైవేద్యంగా పెట్టడం వల్ల.. సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు దేవుడికి నువ్వులు, బెల్లంతో చేసిన స్వీట్ ని సమర్పిస్తే.. చాలా అదృష్టవంతులవుతారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశివాళ్లు.. శనగపిండితో చేసిన స్వీట్స్ ని దేవుడికి నైవేద్యంగా పెడితే.. మంచి భవిష్యత్ ని, సంపదను పొందుతారు.

మకర రాశి
గులాబ్ జామున్, నల్ల ద్రాక్షను దేవుడికి ప్రసాదం పెట్టడం వల్ల మరక రాశి వాళ్లు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సందప పొందుతారు.

కుంభ రాశి
చాక్లెట్ బర్ఫీ, సపోటా పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే.. చాలా సత్ఫలితాలు పొందుతారు.

మీన రాశి
మీన రాశి వాళ్లు.. పూజ చేసేటప్పుడు క్రిష్ణుడికి జిలేబి లేదా అరటిపండ్లను నైవేద్యంగా పెడితే.. సంపన్నులవుతారు.



Click it and Unblock the Notifications