Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
2026లో పెళ్లికి అదిరిపోయే ముహూర్తాలు ఇవిగో!
పెళ్లి అంటే కేవలం ఒక తంతు కాదు, అది రెండు కుటుంబాల కలయిక. ముహూర్తం బాగుంటే సంసారం బాగుంటుందన్నది మన నమ్మకం. 2026 సంవత్సరం పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న వారికి ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. జ్యోతిష్య శాస్త్ర పండితుల విశ్లేషణ ప్రకారం..రాబోయే 2026 సంవత్సరం వివాహాలకు, శుభకార్యాలకు అత్యంత అనుకూలమైనదిగా నిలవనుంది.
2026 ఏడాది పొడవునా పెళ్లిళ్లకు అనేక శుభ సమయాలు ఉన్నాయని, కళ్యాణ ఘడియలు బలంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని జ్యోతిష్య కారణాల వల్ల సంవత్సరం ఆరంభంలోనే పెళ్లి సందడి మొదలుకాదు. ప్రస్తుతం డిసెంబర్ 16 నుంచి ఖర్మాలు(ధనుర్మాసం) ప్రారంభమయ్యాయి. ఇవి 2026 జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో (మకర సంక్రాంతి) ముగుస్తాయి. సాధారణంగా సంక్రాంతి తర్వాత ముహూర్తాలు మొదలవుతాయి, కానీ ఈసారి పరిస్థితి వేరు.

వివాహ కారకుడైన శుక్రుడు డిసెంబర్ 9 నుంచి అస్తమించి ఉన్నాడు (శుక్ర మౌఢమి). ఈ శుక్ర అస్తమయం 2026 ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది. శాస్త్రం ప్రకారం శుక్రుడు అస్తమించినప్పుడు వివాహాలు జరిపించరు. కాబట్టి జనవరిలో ముహూర్తాలు లేవు.
ఫిబ్రవరి నుంచే వాయిద్యాలు
ఫిబ్రవరి 4, 2026 నుంచి శుభ ముహూర్తాలు ఘనంగా ప్రారంభమవుతాయి. అయితే ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 4 వరకు హోలాష్టక కాలం, అలాగే మార్చి 14న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏప్రిల్ 13 వరకు మళ్లీ చిన్న విరామం ఉంటుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే అధిక మాసం, ఆషాఢంలో మొదలయ్యే చాతుర్మాస్యం కారణంగా కొన్ని నెలలు ముహూర్తాలు ఉండవు.
అయినప్పటికీ, 2026లో మొత్తం 59 శుభ దినాలు ఉన్నాయి. అందులో మే నెల వరకు అందుబాటులో ఉన్న 36 ముహూర్తాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
నెలవారీగా వివాహ ముహూర్తాల జాబితా
ఫిబ్రవరి 2026 (12 ముహూర్తాలు)
ఫిబ్రవరి నెలలో వివాహాలకు అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి.
తేదీలు: ఫిబ్రవరి 5 (గురువారం), 6 (శుక్రవారం), 8 (ఆదివారం), 10 (మంగళవారం), 12 (గురువారం), 14 (శనివారం), 19 (గురువారం), 20 (శుక్రవారం), 21 (శనివారం), 24 (మంగళవారం), 25 (బుధవారం), 26 (గురువారం).

మార్చి 2026 (8 ముహూర్తాలు)
మార్చి ఆరంభంలోనే మంచి రోజులు ఉన్నాయి.
తేదీలు: మార్చి 2 (సోమవారం), 3 (మంగళవారం), 4 (బుధవారం), 7 (శనివారం), 8 (ఆదివారం), 9 (సోమవారం), 11 (బుధవారం), 12 (గురువారం).
ఏప్రిల్ 2026 (8 ముహూర్తాలు)
మీన రాశి సంక్రమణం తర్వాత ఏప్రిల్ రెండో భాగంలో ముహూర్తాలు మొదలవుతాయి.
తేదీలు: ఏప్రిల్ 15 (బుధవారం), 20 (సోమవారం), 21 (మంగళవారం), 25 (శనివారం), 26 (ఆదివారం), 27 (సోమవారం), 28 (మంగళవారం), 29 (బుధవారం).
మే 2026 (8 ముహూర్తాలు)
వేసవిలో పెళ్లిళ్లు ప్లాన్ చేసుకునేవారికి మే నెలలో మంచి తేదీలు ఉన్నాయి.
తేదీలు: మే 1 (శుక్రవారం), 3 (ఆదివారం), 5 (మంగళవారం), 6 (బుధవారం), 7 (గురువారం), 8 (శుక్రవారం), 13 (బుధవారం), 14 (గురువారం).
మొత్తంగా చూస్తే మే నెల వరకే 36 మంచి రోజులు ఉన్నాయి. ఆ తర్వాత జూన్, జూలై, అలాగే సంవత్సరం చివరలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా వివాహాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి.
ముఖ్య గమనికలు
మూఢమి: 2026లో గురు మూఢమి లేదా శుక్ర మూఢమి ఏ తేదీల్లో వస్తుందో కచ్చితమైన పంచాంగం చూసి నిర్ధారించుకోవాలి. మూఢమి రోజుల్లో పెళ్లిళ్లు చేయరు.
వధూవరుల జాతకాలు: పైన చెప్పినవి సాధారణంగా అందరికీ ఉండే శుభ సమయాలు. కానీ వధూవరుల జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా తారాబలం, చంద్రబలం చూసి మాత్రమే ముహూర్తం నిర్ణయించాలి.



Click it and Unblock the Notifications