Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రాజ్ నిడిమోరుతో సమంత భూత శుద్ధి వివాహం.. దీని ప్రత్యేకత ఏంటి?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు చెబితే చాలు సోషల్ మీడియాలో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. సినిమాల్లో ఆమె ఎంత బిజీగా ఉన్నా, ఆరోగ్యం పరంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా, ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం చర్చనీయాంశం అవుతుంది. ఇవాళ సమంత రెండో పెళ్లి చేసుకొని అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరక్టర్ రాజ్ నిడిమోరు, సమంత ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ వార్తలను నిజం చేస్తూ రాజ్ నిడిమోరు, సమంత ఇవాళ పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.

అతికొద్దిమంది సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా..పెళ్లి ఫొటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలలో సమంత ఎరుపు రంగు చీర కట్టుకొని కనిపిస్తోంది. అయితే పెళ్లి జరిగిన లింగ భైరవి ఆలయాన్ని గతంలో సమంత చాలా సార్లు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఆరాధ్య దైవం గుడిలోనే సమంత ఇవాళ భూత శుద్ధి పద్ధతిలో రెండో పెళ్లి చేసుకుంది. వీరి సోసల్ మీడియా వేదికగా ప్రముఖులు,నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అసలేంటి ఈ భూత శుద్ధి వివాహం?
ఇది ఒక వ్యక్తితో జరిగే పెళ్లి కాదు. హిందూ ధర్మం, యోగ శాస్త్రం ప్రకారం..మానవ శరీరం పంచభూతాలతో (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) నిర్మితమైంది. ఈ ఐదు మూలకాలను శుద్ధి చేసి, శరీరాన్ని, మనసును సమతుల్యం చేసుకోవడాన్నే భూత శుద్ధి అంటారు.
నేటి కాలంలో చాలా వివాహాలు శారీరక ఆకర్షణ, సామాజిక హోదా లేదా ఆర్థిక అవసరాల ప్రాతిపదికన జరుగుతున్నాయి. కానీ భూత శుద్ధి వివాహం దీనికి పూర్తి భిన్నం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కేవలం శారీరకంగా లేదా మానసికంగా దగ్గరవ్వడం మాత్రమే కాదు, వారిలోని ప్రాణశక్తి ఒకదానితో ఒకటి పెనవేసుకుంటుంది.
వధూవరుల శరీరాల్లోని పంచభూతాలను ఒకే లయలో స్పందించేలా చేయడం ద్వారా, వారిద్దరి మధ్య విడదీయలేని ఒక శక్తివంతమైన బంధం ఏర్పడుతుంది. ఇది వారిని భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా, ముక్తి మార్గంలో ప్రయాణించే సహ యాత్రికులుగా మారుస్తుంది.
ఎందుకింత ప్రత్యేకం?
-ఈ వివాహ పద్ధతిలో దంపతుల మధ్య అవగాహన మాటలకు అందనంత లోతుగా ఉంటుంది. వారి ఆలోచనలు, భావోద్వేగాలు ఒకే దిశలో ప్రయాణిస్తాయి.
-ఇద్దరూ కలిసి తమలోని చైతన్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇది ఒక మెట్టులా పనిచేస్తుంది. సంసార సాగరంలో కొట్టుకుపోకుండా, ఆనందంగా జీవిస్తూనే మోక్షం వైపు అడుగులు వేయడానికి ఈ బంధం సహకరిస్తుంది.
-ఇద్దరు వ్యక్తులు తమ గత కర్మలను ప్రక్షాళన చేసుకుని, కొత్త జీవితాన్ని స్వచ్ఛంగా ప్రారంభించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
-భూత శుద్ధి వివాహం అనేది ఆడంబరాలకు సంబంధించినది కాదు. ఇది ఆత్మలకు సంబంధించినది. ఒకరినొకరు యజమానిగానో, బానిసగానో కాకుండా.. ఒకరిలో ఒకరు సగభాగంగా, పరస్పర పూరకాలుగా జీవించే అద్భుత జీవన విధానం ఇది. నేను అనే భావన నుంచి మనం అనే దివ్యమైన స్థితికి చేరుకోవడమే ఈ వివాహ అంతరార్థం. అందుకే, ఇది కేవలం పెళ్లి కాదు.. రెండు ప్రాణాల పవిత్ర యజ్ఞం అని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications