Latest Updates
-
సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు -
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.? -
వ్యాధినిరోధక శక్తిని పెంపు, ఎముకలకు కొండంత బలం..హైదరాబాదీ పెళ్లిళ్ల స్పెషల్ మటన్ మరాగ్ -
మీ పిల్లల్లో చుండ్రు సమస్య.. ఈ జెల్‌ను కాసేపు తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.? -
రోజుకు ఎన్ని పండ్లు తినాలి? డాక్టర్ చెబుతున్న చేదు నిజాలివే! -
పెళ్లి కాలేదా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువే! -
ఇడ్లీ,దోశలు వేస్ట్..ఇది తింటేనే అసలైన శక్తి..టేస్ట్ కేకో కేక! -
కొబ్బరి చెట్లు తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు పెరుగుతాయో తెలుసా.? -
మీ పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారా? ఈ ట్రిక్ తెలిస్తే అసలు ఫోన్ జోలికే వెళ్లరు! -
కళ్లు తరచుగా పొడిబారుతున్నాయా.. ఇదే కారణం అనుకుంటే పొరబడినట్లే.!
కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ?
వివాహ బంధం కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే పెళ్లి చేయడానికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. అలాగే... ఇద్దరి జాతకాలు కలిశాయో లేదో చూడటం కూడా.. అనాదిగా వస్తున్న ఆచారం. ఇద్దరి జాతకాలు కలిసిన తర్వాతే పెళ్లి విషయంలో ముందడుగు వేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
READ MORE: వివాహాలలో కుండలిల ప్రాముఖ్యత
అయితే పెళ్లిళ్లలో ఎక్కువగా వినిపించేది కుజదోషం. కుజ దోషం ఉన్నవాళ్లకు పెళ్లి కూడా జరగదని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. సంబంధం కుదుర్చుకునే సమయంలో.. కుజ దోషం గురించి పట్టించుకోవడం హిందువుల సంప్రదాయం. ఒక వేళ కుజ దోషం లేదా మంగ్లిక్ దోషం ఉంటే వాళ్లతో వివాహం జరిపించడానికి ఆయా కుటుంబాలు అంగీకరించవు. అలాగే కుజ దోషం ఉన్న వ్యక్తులకు పెళ్లిళ్లు కావు అనే నమ్మకం ఎక్కువగా ఉంది. అయితే పెళ్లి జరగాలి అంటే కుజ దోషం పోవడానికి పరిహారాలు కూడా ఉన్నాయి. అసలు కుజ దోషం అంటే ఏమిటి ? కుజ దోషం ఉంటే పెళ్లి జరగదా ? కుజ దోషానికి పరిహారాలున్నాయా ? అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ?

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజదోషం ఉన్నవాళ్లు కొన్ని పూజలు చేయడం వల్ల ఆ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ గ్రహ దోషం వల్ల అనేక మంది స్ర్తీ, పురుషులకు పెళ్లి కాదు. కుజుడు లేదా అంగారక గ్రహం అశుభ ప్రభావం వల్ల ఈ కుజ దోషం కనిపిస్తుంది.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజ దోషం ఉన్నట్లు అర్థం. ఈ స్థానాల్లో కుజుని ఆధిపత్యమే కాకుండా.. సూర్య, గురు, రాహు, కేతువులు ఆధిపత్యం వహించడం లేదా ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజ దోషం ఉందని జ్యోతిష్యులు చెబుతారు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం, స్వభావం వంటివాటిని కుజుడు సూచిస్తాడు. బర్త్ చార్ట్ లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దూకుడు స్వభావం కలిగి ఉండటం, స్వభావంలో సమస్యలు ఎదురవుతాయి.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజ దోషం వల్ల బ్యాడ్ లక్ వెంటాడుతుంది. పైన చెప్పిన ఏ స్థానాల్లో కుజుడు ప్రవేశించినా పెళ్లిలో సమస్యలు ఎదురవుతాయి. అలాగే సంక్షోభం, కలత ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుజ దోషం కారణంగా విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం వంటి పరిస్థితులు కూడా జరుగుతాయి.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజదోషాన్నేమాంగ్లిక్ దోషం, మంగళ దోషం, భోమ్ దోషం, అంగారక్ష దోషం అని పిలుస్తారు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజ దోషం వల్ల భాగస్వామి చనిపోయే అవకాశముందని చాలామంది నమ్ముతారు. అయితే కొంతమంది ఈ నమ్మకాన్ని కొట్టిపారేస్తున్నారు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజ దోషం నుంచి బయటపడటానికి చాలా మంది రకరకాలుగా పూజలు కూడా చేస్తారు. పరిష్కారాలున్నాయని చెబుతారు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజ దోషం ఉన్న వాళ్లకు ప్రధానంగా కుంభ వివాహం చేస్తారు. అంటే అరటిచెట్టుకు లేదా రావి చెట్టుకు లేదా వెండి లేదా బంగారు విష్ణువు ప్రతిమకు కుజ దోషం ఉన్న వ్యక్తితో పెళ్లి జరపడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని జ్యోతిష్యులు సూచిస్తారు. కుజ దోషం వల్ల కలిగే అనర్థాలను ఈ పెళ్లి ద్వారా పోగొట్టుకోవచ్చని నమ్మకం.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి కూడా కుజ దోషం ఉండటంతో.. ఆమెకు ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేశారు. తర్వాతే అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిపించారు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
కుజ దోషం ప్రభావం నివారించుకోవడానికి నవగ్రహ దేవతలను పూజించడం మరో పరిష్కార మార్గం. ప్రతి మంగళవారం నవగ్రహాలకు పూజ చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళ వారం హనుమాన్ ని దర్శించుకుని నెయ్యి దీపం వెలిగించినా.. ఈ దోషం తొలగిపోతుంది.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
ఈ కుజ దోషం మహిళలు, స్ర్తీలు ఇద్దరిపైనా ప్రభావం చూపుతుంది. అయితే కుజ దోషం ఉన్న ఇద్దరూ అంటే స్ర్తీ, పురుషులకు పెళ్లి చేస్తే.. ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.

కుజదోషం అంటే ఏమిటి ? పరిహారాలేంటి ?
జాతకాలు కలవక పోవడం వల్లే .. వివాహాలు ఫెయిల్ అవుతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఇద్దరి మధ్య ప్రేమ, అర్థం చేసుకునే తత్వం కూడా వివాహ బంధానికి చాలా అవసరం.



Click it and Unblock the Notifications