Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సంచలనం సృష్టించిన ఓషో సెక్స్ ఫిలాసఫీ.. పాపులరిటీ తగ్గని శృంగార గురువు..!
భారత దేశంలో ఎంతో మంది ఘ్నానులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు వున్నారు. వీరిలో కొందరు సంచలనంగా మారారు. అలాంటి వారిలో ఓషో ఒకరు. ఇతని అసలు పేరు రజనీష్. భగవాన్ రజనీష్‌గా తరువాత ఓషాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈయనకు భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక స్థానాన్నిచ్చింది. ఇతని రచనలతో మహాత్మాగాంధీ రచనలకిచ్చిన విలువను ఇచ్చి పార్లమెంటులో ఈయన రచనలను పొందుపరిచారు.
ఆద్మాతిక గురువుగా వున్న ఓషోను చాలా మంది సెక్స్ గురువుగా పిలిచారు. చిన్నప్పటి నుంచే రజనీష్ సాంప్రదాయ మతాన్ని విమర్శిస్తూ వస్తూనే వున్నాడు. కాలేజ్ డిబేట్‌లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచేవాడు. రజనీష్ మహాత్మా గాంధీ ఆలోచనలను కూడా బాగా వ్యతిరేకించాడు. 1970లో ఓషో బహిరం ధ్యాన కార్యక్రమాలను ప్రారంభించాడు. రజనీష్ చెప్పిన ఫిలాసఫీ అందరినీ బాగా ఆకర్షించింది. వ్యాపారులు, సెలబ్రెటీలు అతని ఫిలాసఫీకి ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు. ఈ ఫిలాసఫీతో రజనీష్ ఓషోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అసలు ఓషో ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందా.
సాధారణ మానవుడు ఆలోచించే విషయాలకు మొత్తం విరుద్ధంగా ఓషో ఫిలాసఫీ వుంటుంది. జీవితాన్ని ఎలా జీవించాలో ఓషో ఫిలాసఫీ చెబుతుంది. ఆయన ఫిలాసఫీ ఘ్నానానికంటే కూడా వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. జీవితాన్ని నీకు అనుకూలంగా వినియోగించుకోకపోవడమే నీ దు:ఖానికి కారణమని ఓషో అంటాడు. జీవితంలో ఏది చేసిన సంతోషం ఇవ్వకపోతే అది వ్యర్ధం అని ఓషో అంటాడు.

ఓషో ఫిలాసఫీ ప్రకారం సంతోషం అంటే విచ్చలవిడి సెక్స్. ఈ సెక్స్ వల్లే మనిషి పుడతాడు, ఈ సెక్స్ వల్లే మనిషి ముక్తిని కూడా పొందుతాడని చెబుతాడు. సమాజం సెక్స్‌ను అణచివేస్తుంది, ఇది సరైంది కాదని ఓషో అంటాడు. సెక్స్ పై ఓషో చేసిన ప్రసంగాలకు అక్కడక్కడా బహిరంగంగా విమర్శలు కూడా వచ్చాయ్. అందరి ఆధ్యాత్మిక గురువుల్లో ఓష భిన్నంగా చెప్పాడు.
ముక్తి కావాలంటే కుటుంబం, సుఖాలు, సెక్స్ అన్నింటినీ వదిలివేయాలని చాలా మంది ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. కాని ఓషో మాత్రం కుటుంబంతో వుంటూ సెక్స్ అనుభవిస్తూ, ఘ్నానాన్ని సంపాదింస్తూ ముక్తిని పొందాలని చెబుతాడు. ఓషో చేసిన ప్రసంగాలు వివాదాస్పదమవడంతో అప్పటి నుంచి ఓషోను సెక్స్ గురువుగా పిలవడం ప్రారంభించారు.
ఓషో ఫిలాసఫీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత వుంది. అయితే భారత దేశంలో 1980 కాలంలో జనతా పార్టీ ఆయన చేసిన ప్రసంగాలకు విసుగు చెంది భారత్ నుంచి తరిమివేశారు. దీంతో ఆయన అమెరికా వెళ్లారు. అమెరికాలో కూడా వివాదాస్పద ప్రసంగాలు చేయడం వల్ల అక్కడ కూడా అరెస్ట్ అయ్యాడు. ఓషో రచించిన రచనలు, ప్రసంగాలు అశాంతిని, గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఓషోను అంతమొందించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడికి కూడా సమాచారాన్ని చేరవేశారని అంటాడు. కొన్ని రోజులు అమెరికా జైళ్లో అరెస్టయి తరువాత మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చాడు.
1990 కాలంలో భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. చివరగా 1990 జనవరి 19న ఓషో గుండెపోటుతో మరణించాడు. అయితే ఓషో పై హత్యా యత్నం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయ్. మొత్తంగా ఓషో అంటే సెక్స్ గురువుగా ఇప్పటివరకు గుర్తింపును సాధించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈయన రచనలను పొగిడారంటే ఓషోకు వున్న పాపులారిటీని అర్ధం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications