Latest Updates
-
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే!
మీకు మంచి జరిగే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయ్..! వీటిని ఎప్పుడైనా గమనించారా..?
చంద్రుడు సూర్యుడు ఎలా వచ్చి పోతుంటారో, మన జీవితంలో కూడా కష్టాలు అలాగే వచ్చి పోతుంటాయ్. మన జీవితంలో సుఖసంతోషాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఒక సారి నారదుడు వైకుంఠం వెళ్తాడు. అప్పుడు ఆదిశేషువు పైన నారాయణుడు పడుకొని వుంటాడు. భూలోకంలో ఎంతో మంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారు అని చెబుతాడు. జీవితంలో కష్టాలనేవి వస్తుంటాయ్. అయితే కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం.

శుభాలు కలిగే ముందు కనిపించే వచ్చే సంకేతాలు
ఎవరికైతే బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకవ వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో, వాళ్లు తెలియకుండా శివనామస్మరణ లేదంటే విష్ణు నామస్మరణ చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతంగా చెప్పుకోవచ్చు.
కలలో ఎవరికైనా ఏనుగు కానీ తెల్ల గుర్రం కానీ కనబడితే వారికి త్వరలోనే లక్ష్మీ అనుగ్రహం కనబడుతుందని అర్థం చేసుకోవాలి.
ఇంట్లోకి గోమాత గనుక వస్తే లేదంటే ఇంటి ముందటకి గోమాత వచ్చి ఏవైనా తింటే వారికి త్వరలో కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం. గోవు శరీరంలో ముక్కోటి దేవతలు వుంటారు కాబట్టి గోవు వస్తే చాలా శుభప్రదం.
ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తున్న సమయంలో దేవుడి ఫోటో పైనుంచి పువ్వు కిందపడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయ్.
పురుషులను కుడి కన్ను అదురుతున్నా, కుడి చేయి అదురుతున్నా త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఒక వేల మహిళలకు ఎడమకన్ను, ఎడమచేయి అదుతుతూ వున్నా వారికి కూడా సమస్యలు త్వరలోనే తీరిపోతున్నాయని అర్థం.

ఇంట్లోకి ఆంజనేయస్వామి ప్రతిరూపమైన కోతి పూజా మందిరంలోకి వచ్చి కొబ్బరి చిప్ప, లేదంటే పండు తీసుకొని గనుక వెళితే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అర్ధం. ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్లినా రాయితో, కట్టెతో కొట్టవద్దు. కోతి వచ్చిందంటే లక్ష్మీ దేవి త్వరలో కాలుపెట్టబోతోందని అర్థం.
చిన్న ఆడపిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలివేస్తుందని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్లేనని పండితులు చెబుతున్నారు. ఇలా వచ్చిన పిల్లలకు తీపివస్తువులు, బెల్లం, లడ్డూ లాంటివి కఛ్ఛితంగా పెట్టాలి.
ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు గోమాత, ఏనుగు, గుర్రం ఎదురైతే చాలా శుభప్రదం. వెళ్లిన పని సకాలంలో పూర్తవుతుంది. అన్నీ శుభాలు కలుగుతాయ్.
ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలువ వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మన్మధుడి వాహనం చిలుక. లక్ష్మీ దేవి కుమారుడు మన్మధుడు. కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతున్నట్టే.
ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ వుంటే ఇంట్లోకి లక్ష్మీ దేవి రాబోతోందని అర్థం చేసుకోవాలి. త్వరలోనే ఇంట్లో వున్న కష్టాలన్నీ తొలగిపోతాయనడానికి సంకేతం.
పైన వున్న సంకేతాలన్నీ మానవులకు మంచి రోజులు వచ్చే ముందు కనిపిస్తాయని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య ఆలోచన లేకుండా శ్రీమహావిష్ణువుకు చెందిన అష్టాష్టరీ మంత్రాన్ని జపిస్తారో వారిని సర్వకాలాల్లో కాపాడుతానని శ్రీ మహావిష్ణువు చెప్పాడు.



Click it and Unblock the Notifications