Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే..
సనాతన ధర్మంలో గృహస్థాశ్రమానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఒక ఇల్లు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలన్నా.. ఆ కుటుంబ యజమాని వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా ఇంటి ఇల్లాలు పాటించే నియమాలు ఎంతో కీలకమని పెద్దలు చెబుతుంటారు.

జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. భర్త ఆఫీసుకు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఆ నియమాలు పాటిస్తే భర్త వెళ్లిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్మకం. ఆ పనులు ఏమిటో ఇక్కడ చూడండి.
వెంటనే ఇల్లు ఊడవడం, శుభ్రం చేయడం
భర్త పని మీద బయటకు వెళ్లగానే హడావిడిగా చీపురు పట్టి ఇల్లు ఊడవడం, తుడవడం లేదా శుభ్రం చేయడం లాంటివి చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా అశుభం. ఇలా చేస్తే సాక్షాత్తూ లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లేనని, దీనివల్ల భర్త వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయని పండితులు చెబుతారు. ఆయన వెళ్లిన అరగంట లేదా గంట తర్వాతే ఈ పనులు చేపట్టాలని సూచిస్తున్నారు.
వెంటనే స్నానం చేయడం
భర్త ఏదైనా శుభకార్యానికి, ఇంటర్వ్యూకి లేదా ముఖ్యమైన డీల్ కోసం బయలుదేరిన వెంటనే భార్య తలస్నానం చేయడం లేదా మామూలు స్నానం చేయడం నిషిద్ధం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఇలా చేయడం వల్ల ప్రయాణంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆయన వెళ్లిన పని సఫలం కాకుండా అడ్డంకులు వస్తాయి.
జుట్టు దువ్వడం, గోళ్లు కత్తిరించడం
భర్త ఇంటి నుంచి వెళ్లిన వెంటనే అద్దం ముందు కూర్చుని జుట్టు దువ్వుకోవడం, వెంట్రుకలు సరిచేసుకోవడం, అలాగే గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పనులు రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాలను ఆకర్షిస్తాయి. ఫలితంగా ఆకస్మిక అవాంతరాలు లేదా ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని విశ్వసిస్తారు.

అలంకరణలు (మేకప్) తొలగించడం
హిందూ సంప్రదాయంలో స్త్రీల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. భర్త బయటకు వెళ్లిన వెంటనే నుదుటి మీది బొట్టును తీసేయడం, పూలు తీసేయడం లేదా చేసుకున్న అలంకరణను హడావిడిగా తొలగించడం అశుభకరం. ఇంటి గృహలక్ష్మి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. వెంటనే అలంకరణ తీసేస్తే అది దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు.
ఎంగిలి గిన్నెలు కడగడం
భర్త భోజనం చేసి బయటకు వెళ్లిన వెంటనే వంటగదిలోకి వెళ్లి ఎంగిలి గిన్నెలు కడగడం, స్టవ్ తుడవడం లాంటివి చేయకూడదు. అన్నపూర్ణాదేవి కొలువైన వంటగదిని ఆయన వెళ్లిన వెంటనే శుభ్రం చేయకుండా, కాస్త సమయం ఆగి శుభ్రపరుచుకోవడం ఇంటికి శ్రేయస్కరం.
పదునైన వస్తువులు, ఉప్పు అప్పుగా ఇవ్వడం
భర్త ఇల్లు విడిచి వెళ్లిన తర్వాత, ఇరుగుపొరుగు వారు అడిగారని ఉప్పు, సూదులు, కత్తెరలు లేదా కత్తులు లాంటి పదునైన వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, భర్త చేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో ధననష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది.
నీరు పారబోయడం, కుండలు ఖాళీగా ఉంచడం
భర్త వెళ్లిన వెంటనే ఇంటి గుమ్మం ముందు లేదా బయట నీళ్లు పారబోయడం అశుభంగా భావిస్తారు. ఇది కుటుంబ సంపద తరిగిపోవడానికి సంకేతం. అలాగే ఇంట్లో నీటి బిందెలు లేదా బకెట్లను ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. ఒకవేళ వాటిలో నీళ్లు లేకపోతే, వాటిని బోర్లించి (తలకిందులుగా) ఉంచాలి.
Disclaimer: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని విశ్వసించడం వ్యక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications