Latest Updates
-
విటమిన్ B, విటమిన్ C పుష్కలం..చలికాలంలో సాయంత్రం పూట తప్పక తాగాల్సిన సూప్ ఇదే..ఎలా చేయాలంటే.. -
షుగర్ పేషెంట్లు తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే..ఎంత మోతాదులో తినాలంటే.. -
చలికాలంలో అందరూ తప్పక తినాల్సిన లడ్డు ఇదే..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
హార్మోన్ల సమతుల్యత నుండి ఎముకల బలం వరకు.. ప్రతి మహిళ తినాల్సిన 5 ఆరోగ్యకరమైన ఆహారాలు! -
ఎగ్ కీమా మసాలా ఇలా చేస్తే.. 2 చపాతీలు ఎక్కువే తింటారు! -
ఆరు కోట్ల బిజినెస్, రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తకు ఫుడ్ లో విషం.. కన్నకొడుకునూ వదలని కిరాతక తల్లి! -
చలికాలంలో జీర్ణశక్తిని పెంచే క్యారెట్ పచ్చిమిర్చి పచ్చడి..ఇలా చేస్తే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ! -
మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే సబ్బును ఈజీగా తయారు చేసుకోండిలా.. -
మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే! -
చట్నీ కూడా అవసరం లేని అద్భుతమైన టిఫిన్.. పోషకాలు నిండిన ముల్లంగి అటుకుల దోసె ఇంట్లోనే ఇలా చేయండి!
తెల్లగా మెరిసే పళ్లు ఆరోగ్యానికి సంకేతమా? పళ్ళ రంగు గురించి మీకు తెలియని నిజాలివే!
మనం నవ్వినప్పుడు మెరిసే తెల్లటి పలుకులు అందరినీ ఆకర్షిస్తాయి. అయితే దంతాలు ఖచ్చితంగా ఇంత తెల్లగానే ఉండాలి అనే నిర్దిష్టమైన ప్రమాణం ఏదీ లేదని మీకు తెలుసా? దంత వైటెనింగ్, ఫిల్లింగ్స్, క్రౌన్స్ లేదా వెనియర్స్ వంటి ట్రీట్మెంట్స్ చేసినప్పుడు, దంతవైద్యులు సాధారణంగా 16 రకాల తెలుపు షేడ్స్ ను ఉపయోగిస్తారు. దంతాల రంగు వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూడండి.
వయసుతో పాటే మారే రంగు
వయసు పెరిగే కొద్దీ మన దంతాల రంగులో సహజంగానే మార్పులు వస్తాయి. చిన్న పిల్లల పాల పళ్ళు వాటి ఖనిజ కూర్పు కారణంగా చాలా తెల్లగా మెరుస్తాయి. కానీ ఆరేళ్ల వయసు తర్వాత వచ్చే శాశ్వత దంతాలు కొద్దిగా ముదురు పసుపు లేదా ఎరుపు ఛాయను కలిగి ఉంటాయి. నిజానికి పళ్ళలోని ట్యూబ్యూల్స్ అనే చిన్న ఖనిజ గొట్టాల వల్లే ఈ రంగు వస్తుంది. 50 నుండి 70 ఏళ్ల వయసు వచ్చేసరికి దంతాలు క్రమంగా మరింత పసుపు రంగులోకి మారుతాయి.

పసుపుదనం వేగంగా పెరగడానికి కారణాలు
వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పులే కాకుండా, మనకున్న కొన్ని అలవాట్లు దంతాలు త్వరగా పసుపు రంగులోకి మారేలా చేస్తాయి.
-పళ్ళు కొరికే అలవాటు (పళ్ళను గట్టిగా నూరడం లేదా బిగించడం)
-గట్టి పదార్థాలను పళ్ళతో కొరకడం.
-టీ, కాఫీ లేదా రంగు కలిగిన ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం.

తెల్లటి దంతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లేనా?
పళ్ళు తళతళా మెరిసిపోతున్నంత మాత్రాన అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని భావించకూడదు. తెల్లటి దంతాలు మంచి నోటి ఆరోగ్యానికి ఎప్పుడూ సంకేతం కావు. పైకి తెల్లగా కనిపించినా లోపల పుచ్చు లేదా దంత క్షయం ఉండవచ్చు. అంతేకాకుండా, చిగుళ్ల సమస్యలు కూడా మీ దంతాల సహజ రంగును ప్రభావితం చేస్తాయి.
ముందు పళ్ళు ఎందుకు అంత తెల్లగా కనిపిస్తాయి?
మన కళ్ళు రంగును గ్రహించే విధానం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. మన పెదవులు, చిగుళ్లు,చర్మం రంగును బట్టి దంతాల రంగు మారినట్లు అనిపించవచ్చు. అలాగే, వివిధ రకాల కాంతి పరిస్థితులలో పళ్ళ తెల్లదనం ఒక్కోసారి ఒక్కో విధంగా కనిపిస్తుంది.
16 షేడ్స్ రహస్యం
దంతవైద్యులు మీ పంటికి సరిపోయే రంగును ఎంచుకోవడానికి 16 షేడ్స్‌తో కూడిన వీటా క్లాసికల్ షేడ్ గైడ్ ను ఉపయోగిస్తారు. ఈ గైడ్ కేవలం తెలుపు రంగునే కాకుండా, రంగు రకాన్ని, దాని గాఢతను,లేతదనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. తద్వారా మీ చిరునవ్వుకు అత్యంత సహజమైన అందాన్ని అందిస్తుంది.
కాబట్టి దంతాల ఆరోగ్యం కోసం కేవలం తెల్లదనంపైనే కాకుండా, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
