భారతదేశపు అత్యంత పురాతన స్వీట్ ఇదే!

భారతదేశం అనేక విశిష్టమైన ఆహారపదార్థాలకు, నోరూరించే స్వీట్లకు పుట్టినిల్లు. మన దైనందిన జీవితంలో, పండుగలలో, మతపరమైన ఆచారాలలో తీపి పదార్థాలులేదా స్వీట్స్ ఒక విడదీయరాని భాగం. ప్రస్తుతం గులాబ్ జామూన్, జిలేబీ, బర్ఫీ వంటి ఎన్నో స్వీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చక్కెర ఇంకా వాడుకలోకి రాని కాలంలోనే మన పూర్వీకులు ఒక అద్భుతమైన తీపి వంటకాన్ని ఆస్వాదించారని మీకు తెలుసా?

వేద కాలం నాటి మధుర స్మృతి

భారతదేశపు అత్యంత పురాతన స్వీట్ మాల్పువా. చరిత్రకారుల ప్రకారం, మాల్పువా మూలాలు సుమారు 3000 ఏళ్ల క్రితం నాటి వేద కాలంలో ఉన్నాయి. ఋగ్వేదంలో దీనిని అబూబా అని పేర్కొన్నారు. నాడు చక్కెర, డ్రై ఫ్రూట్స్ వంటివేవీ లేకపోయినా, బార్లీ పిండిని స్వచ్ఛమైన నెయ్యిలో వేయించి, తేనెతో తీపి చేసేవారు. ఇది ఎంతో పోషకమైన, సంతృప్తినిచ్చే వంటకంగా ఉండేది.

Oldest sweet of india how Vedic abuba evolved into todays beloved malpua

ప్రాచీన భారతదేశంలో ఆహారం, ఆధ్యాత్మికత పెనవేసుకుపోయి ఉండేవి కాబట్టి మతపరమైన వేడుకల్లో దీనిని నైవేద్యంగా సమర్పించేవారు. ఆ కాలంలో బార్లీ ప్రధాన ధాన్యంగా, తేనె ప్రధాన తీపి పదార్థంగా ఉండటం ఈ వంటకాన్ని పవిత్రమైనదిగా, ఆచరణాత్మకమైనదిగా మార్చింది. దీని ప్రస్తావన బౌద్ధ, జైన గ్రంథాల్లోనూ కనిపిస్తుంది. నేటికీ ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో అమలు పేరుతో దీనిని ప్రతిరోజూ దేవునికి వడ్డించడం విశేషం.

కాలానుగుణంగా మారిన రుచి

వ్యవసాయం, వాణిజ్యం మెరుగుపడే కొద్దీ మాల్పువా తయారీలోనూ సరికొత్త మార్పులు వచ్చాయి. బార్లీ స్థానాన్ని గోధుమ, బియ్యపు పిండి ఆక్రమించాయి. తేనెకు బదులుగా చెరకు రసం, శుద్ధి చేసిన చక్కెర పాకం వచ్చి చేరాయి. రుచిని పెంచడానికి పాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలను జత చేశారు. క్రమంగా రాజ వంటశాలల్లోకి అడుగుపెట్టిన మాల్పువా, మరింత విలాసవంతమైన తీపి వంటకంగా మారినా తన ప్రాథమిక రూపాన్ని మాత్రం కోల్పోలేదు.

భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు!భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు!

దేశవ్యాప్తంగా భిన్న రుచులు

అనేక పురాతన వంటకాలు కనుమరుగైనా, మాల్పువా వేల ఏళ్లుగా నిలదొక్కుకోవడానికి దానిలోని వైవిధ్యమే కారణం. ప్రాంతాన్ని బట్టి దీని శైలి మారుతుంది. బెంగాల్ లో దీనిని ఫువాగా తయారుచేసి, సోంపు లేదా కొబ్బరితో రుచిని జోడిస్తారు. బీహార్ లో పిండిలో అరటిపండును కలిపి ఎంతో మృదువుగా తయారు చేస్తారు. రాజస్థాన్ లో వేడివేడి మాల్పువాను చిక్కటి రబ్రతో కలిపి వడ్డిస్తారు. పండుగ సీజన్లలో ఇది అందరికీ ఇష్టమైన ప్రత్యేక వంటకంగా మారుతుంది.

Story first published: Saturday, November 28, 2026, 18:26 [IST]
Desktop Bottom Promotion