Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీగడ తీసిన పాలతో నాజుకైన యువ్వనం!!

పాలు:
పూర్తిగా మీగడ తీసిన లేదా కొద్దిగా మీగడ తీసిన పాలు బరువు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉప యోగపడతాయి. అంతేకాదు ప్రొటీన్లు, కాల్షియం శరీరానికి సరిపడా అందించడానికి ఇది చాలా మంచి ఎంపిక.
బ్యాలెన్స్‌డ్ డైట్‌లో ఇదొక భాగంగా పిలవబడుతుంది. రోజుకు మూడు కప్పులు (కప్పు 200 మి.లీ) తీసుకుంటే డైటింగ్‌కు చాలా మంచిది. సోయా మిల్క్ కూడా అచ్చంగా ఇలాంటి ఫలితాల్నే ఇస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెపు తున్నారు.
పళ్ల రసాలు:
ఆరెంజ్, పైనాపిల్, బత్తాయి మొదలైన తాజా పళ్ల నుంచి అప్పుడే పిండిన రసంలో ప్రతి 200 మి.లీకు 100 క్యాలరీలు అందించే శక్తి ఉంటుందని ఆహార నిపుణులు చెపుతున్నారు. నాజూకుగా, ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు, బరువు తగ్గాలనుకునేవారికి తాజాగా ఉన్న దబ్బకాయల నుంచి తీసిన రసం ఇంకా మంచి వైద్యంగా పనిచేస్తుంది. అలాగే దానిమ్మ గింజల రసంలో విటమిన్ ఎ- సి- ఇ-, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయని, ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు గ్రీన్‌టీ, రెడ్ వైన్‌లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే మూడురెట్లు అధికంగా ఉంటాయని తాజా పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి.
కూరగాయల రసం:
తాజాగా ఉన్న టొమోటో, క్యారెట్ వంటి వాటి నుంచి తీసిన వెజిటబుల్ జ్యూస్‌లు డైటింగ్‌కు చాలా బాగా పనిచేస్తాయి. ఇలా తీసిన ప్రతి 100 మి.లీ జ్యూస్ ద్వారా 25 క్యాలరీలు లభిస్తాయి. అంతేకాదు ఇందులో 80 మి.గ్రాముల సోడియం కూడా ఉంటుంది. ఆహారంతోపాటు రోజూ ఈమాత్రం జ్యూస్ తీసుకుంటే ఒక్క బరువు తగ్గ డానికే కాకుండా అనేక రోగాలనుంచి కాపాడేందుకు యాంటీఆక్సిడెంట్లను కూడా సరఫరాచేస్తుంది. దీనితో పాటు శరీరానికి శక్తిని సమకూర్చడంలో ప్రధానపాత్రను పోషిస్తుంది.



Click it and Unblock the Notifications