Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
అందమైన శరీరానికి సొగసైన మెడ

1. మెడచర్మం సున్నితం కాబట్టి బరబరా రుద్ది శుభ్రం చేయకూడదు. జుట్టునుంచి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
2. మిలమిల మెరిసే ఛాయ, మృదువైన చర్మం కోసం బొప్పాయి గుజ్జును పది నిమిషాల పాటు ప్యాక్‌గా వేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
3. మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుంది.
4. ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేడినీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి.
5. మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.
6. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.
7. వేడినీటిలో టవల్ ముంచి, గట్టిగా పిండి, దానిని మెడకు చుట్టుకొని పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. దానివల్ల చర్మానికి ఆవిరిపట్టి రక్తవూపసరణ మెరుగవుతుంది.
8. కలబంద గుజ్జు, పసుపు, శనగపిండి కలిపి మెడ నుంచి భుజాల కింద వరకు ప్యాక్ వేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన దూదితో ప్యాక్‌ను పూర్తిగా తీసేయాలి.
9. రోజుకు కనీసం రెండుమూడు సార్లు, నాలుగు నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పాలి. దానివల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి.
10. గిల్ట్ నగలు ధరించటంవల్ల నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటివల్ల దురదలు కూడా వస్తాయి. కాబట్టి వేసవికాలంలో గిల్టు నగలను ధరించకపోవటం ఉత్తమం.
మెడ భాగానికి ఆలీవ్ ఆయిల్ రాసి మసాజ్ చేయటంవల్ల ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి పడుకోబోయేందుకు ముందుగా ఆలీవ్ నూనెను రాసి, ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications