Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
ఆరు ఆహారాల సంమ్మేళనంతో మీరు మెచ్చే కురులు..!

అందమైన కురులు అందానికే వన్నెతెస్తాయి. నల్లగా నిగనిగలాడే దట్టమైన జుట్టు కావాలని ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి కురుల సిరులు మీ సొంతం కావాలంటే మాత్రం ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ క్రింది పదార్ధాలను తీసుకుంటే మీరు కలగన్న వాలుజడకు సరిపడు కురులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పాలు: తెల్లగా ఉండే పాలు నల్లని వెంట్రుకలై ఎలాంటి మ్యాజిక్ చేయగలవు అని సందేహం రావుచ్చు మీకు. నిజానికి పాల వల్ల శరీరానికి కాల్షియంతో పాటు జుట్టుకు కూడా బోలెడు లాభాలు. జుట్టు చిక్కులు పడకుండా దానికి చేతనైనంతగా అది కృషి చేయడంతో పాటు సరికొత్త కేశ కళను లిగించడంలో మీకు ఎంతో తోడ్పడుతుంది. డ్రైహేయిర్‌ను మంచి కండీషన్‌లో తీసుకురావాలనుకుంటే మాత్రం పాలను నమ్ముకోవడం బెస్ట్.
బాదం: రోజుకో ఆపిల్ తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం బాదాంకు కూడా వర్తిస్తుంది. రోజుకు గుప్పెడు బాదాంలను తింటే కేవలం జుట్టుకే లాభం కాదు మీ గుండెకు కూడా మంచిది. టాపిక్ హెయిర్ గురించి కాబట్టి బాదాం వల్ల మీ హెయిర్ సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు, జుట్టు రాలిపోవడం వంటి సవుస్యలు ఎదురుకావు.
వెజిబుల్స్ తక్కువేం కాదు ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకుకూరల వల్ల అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి, కె వంటి విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం సమపాళ్లలో అందుతుంది. రెండవది మీ జుట్టుకు మంచి కండీషనర్‌గా కూడా పనిచేస్తాయి.
గుడ్డు-చికెన్: చికెన్ తింటే న్యూట్రీషన్స్ తో పాటు విటిమిన్స్ ఫ్రీ. జుట్టు ఎదుగుదలకు దోహదం చేసే ప్రోటీన్స్‌కూడా సంవృద్ది.
చేపలు: రెగ్యుర్ గా చేపలను ఆహారంలో భాగంచేసుకుంటే మీ జుట్టు కూడా చిక్కులలో చిక్కుకోవు.. చేపలలో ఉండే విటమిన్ డి ఆరోగ్య వంతమైన కురులకోసం ఉపయోగకరమైనవే కాకుండా, ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్‌తో సంవృద్దిగా ఉంటాయి.
ఫ్లాక్స్ సీడ్స్: ఫ్లాక్స్ సీడ్స్‌లో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్యవంతమైన కురులకోసం కావాల్సిన ప్రొటీన్, ప్రాకృతిక ఫైబర్‌లనుఇది అందిస్తుంది.ఈ విత్తనాల నూనెను సాధారణ నూనెలాగే ఆహారపదార్ధాలలో వినియోగించవచ్చు.



Click it and Unblock the Notifications