Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ముడతల చర్మాన్ని మృదువుగా మార్చేసే కర్జూరం
పోషకాలతో నిండిన కర్జూరాలు ఆరోగ్యానికే కాదు అద్భుతమైన బ్యూటీ ప్రయోజనాలూ ఉన్నాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్న డేట్స్ తీసుకోవడం వల్ల చాలా బ్యూటీ రహస్యాలున్నాయి. చర్మ సౌందర్యానికి, జుట్టు సౌందర్యానికి బాగా తోడ్పడతాయి. విటమిన్ ఏ, బి, కే, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, ప్రొటీన్, విటమిన్స్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటడం వల్ల చర్మం ఆరోగ్యానికి కర్జూరాలు సహకరిస్తాయి.
READ MORE: బరువు తగ్గించడంలో ఖర్జూరం చేసే మ్యాజిక్
రెగ్యలుర్ గా కర్జూరాలు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణలో తోడ్పడే విటమిన్ సి కావాల్సిన మోతాదులో అందుతుంది. కణాల ప్రత్యుత్పత్తికి సహకరిస్తాయి. డ్యామేజైన స్కిన్ ని రక్షించడానికి ఇవి సహాయపడతతాయి. ఇందులో ఉండే మినరల్స్ చర్మం స్మూత్ గా, నిగారింపుగా ఉండటానికి సహాయపడతాయి.
డేట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్ ని తొలగించి, ముఖ వర్చస్సు పెరగడానికి సహకరిస్తాయి. రెగ్యులర్ గా కర్జూరాలు తీసుకోవడం వల్ల పొందే సౌందర్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి
కర్జూరంలో ఉండే ఆయిల్ పోషకాల గని. ఇది జుట్టు కుదుళ్లు దృఢ పరచడానికి తోడ్పడతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి గుప్పెడు కర్జూరాలు తీసుకోవడం వల్ల నిగనిగలాడే కురులు మీ సొంతమవుతాయి.

చర్మం సంరక్షణకు
కర్జూరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మం సాగేగుణం కోల్పోకుండా ఉండటానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు చర్మం స్మూత్ గా, మెరిసేలా చేస్తుంది.
యాంటీ ఏజింగ్
కర్జూరాలు యాంటీ ఏజింగ్ లా పనిచేస్తాయి. చర్మంపై ముడతలు, గీతలను తగ్గించి యంగ్ లుక్ తీసుకురావడానికి ఉపయోగపడతాయి.

జుట్టు రాలడాన్ని అరికట్టడానికి
రోజుకి 2 లేదా 3 కర్జూరాలు తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తొలగిపోతాయి. విటమిన్ బి పుష్కలంగా ఉంటడం వల్ల కుదుళ్లు ఆరోగ్యంగా ఉండి.. ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి.
స్ర్టెచ్ మార్క్స్
కర్జూరాల్లో విటమిన్ బి ఉంటుంది. ఇది చర్మానికి చాలా అవసరం. విటమిన్ తగ్గిపోతే చాలా చర్మ సమస్యలు వస్తాయి.. వాటిలో స్ర్టెచ్ మార్క్స్ ఒకటి. కాబట్టి డేట్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications