Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
విటమిన్ రిచ్ ఫుడ్స్: జుట్టు రాలడం నివారించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి
జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.
జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి .
READ MORE: జుట్టు పెరుగుదలకు 30 వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్
జుట్టు పెరుగుదలలో విటమిన్ బి ప్రధాన పాత్రపోషిస్తుంది . జుట్టు రాలడం అరికట్టాలంటే మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి అధికంగా ఉండే అన్ని రకాల ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. ఈ విటమిన్స్ మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మార్చుతాయి. జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్స్ చాలా మేలు చేస్తాయి.
READ MORE: జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!
జుట్టు పెరుగుదల కోసం వివిధ రకాల హెయిర్ మాస్క్ లు మరియు ఇతర ఉత్పత్తులను తలకు ఉపయోగిస్తున్నారు. ఇవి ఉపయోగకరమైనా శరీరానికి తగినంత విటమిన్స్ అందకపోతే ఎన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకొన్న ప్రయోజనం ఉండదు . మరి స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని విటమిన్స్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా....

బి2 లేదా రొబోఫ్లెవిన్ రిచ్ ఫుడ్స్ :
మష్రుమ్స్ లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. ఆస్పరాగస్ మరియు త్రుణధాన్యాలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చు.

విటమిన్ బి3 లేదా నియాసిన్ రిచ్ ఫుడ్స్ :
నియాసిన్ బీఫ్ లివర్, ఫిష్, బీట్ రూట్, పీనట్, బీఫ్ మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ లో బి3 అధికంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యలను నివారించుకోవడం కోసం ఈ విటమిన్ ఫుడ్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

విటమిన్ బి5 లేదా పాంటోథెనిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్:
ఈ విటమిన్స్ గుడ్డు పచ్చసొన, కార్న్, కేల, లెగ్యుమ్స్ , కాలీఫ్లవర్, బ్రొకోలీ, చికెన్, సాల్మన్ మరియు ధాన్యాలో అధికంగా ఉంటాయి . ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడటానికి నివారిస్తుంది. హెయిర్ గ్రోత్ కు సహాయపడే ఉత్తమ ఆహారాలివి.

విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ రిచ్ ఫుడ్స్ :
ఈ విటిమన్స్ ను అరటిపండ్లు, ఆస్పరాగస్, పచ్చిబఠానీలు, బెల్ పెప్పర్స్, బేక్డ్ పొటాటోస్, నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు అవొకాడోల్లో అధికంగా ఉన్నాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పొందవచ్చు.

విటమిన్ బి7 లేదా బయోటిన్ రిచ్ ఫుడ్స్ :
స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఉల్లిపాయ, బాదం, సెరల్స్, ఈస్ట్, అరటి మరియు సాల్మన్ వంటి ఫుడ్స్ లో అధికంగా ఉన్నాయి . ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ మరియు జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది . మరియు ఇవి హెయిర్ ఫాల్ అరికడుతాయి . జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

విటమిన్ బి8 లేదా ఇనోసిటాల్:
ఈ రెండింటిని సిట్రస్ పండ్లైన ఆరెంజ్, లెమన్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ మరియు టమోటోల్లో అధికంగా చూశాము . ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకవడం వల్ల జుట్టు రాలడం అరికట్టవచ్చు. జుట్టు వేగంగా పెంచుకోవడానికి ఇవి ఒక బెస్ట్ విటమిన్ ఫుడ్స్.

విటిమన్ బి12 రిచ్ ఫుడ్స్:
విటమిన్ బి12 అధికంగా ఉండే చేపలు, చికెన్, లివర్, గుడ్డు, పాలు, పెరుగు మరియు చీజ్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. వీక్ గా ఉన్న హెయిర్ ను బలంగా మార్చడానికి ఈ విటమిన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు జుట్టు రాలడం నివారిస్తాయి.

విటమిన్ బి9 లేదా ఫోలిక్ యాసిడ్ :
ఈ విటమిన్స్ ఆస్పరాగస్, పీస్, గ్రీన్ వెజిటేబుల్స్, బీట్ రూట్ మరియు లెంటిల్స్ లో అధికంగా ఉన్నాయి . ఈ రెండు విటమిన్స్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలడం నివారించడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్స్.

ఖర్జూరం:
ఇనుము లోపం వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

కొబ్బరి నీళ్ళు మరియు నీరు :
నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, సలాడ్ లు అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడం అరికడుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.



Click it and Unblock the Notifications