Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మధ్య వయస్సులో మహిళల మెరుపు...!

1. పెరుగు: చర్మాన్ని దుమ్ము,ధూళి, హానికరమైన సూర్యకిరణాల ప్రభావం నుంచి కాపాటంలో పెరగుకు మించిందిలేదు. 5 టీ ప్పూన్లు పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయి.
2. బాదం: చర్మానికి సంపూర్ణ పోషణ ఇచ్చేందుకు బాదం ఎంతో సహాయపడుతుంది. రోజూ రెండు లేదా మూడు బాదం గింజలు నానబెట్టి పాలతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి 15 నిమిషాలు పట్టించండి. తర్వాత ముఖంపై రుద్ది దీన్ని తీసేయండి. కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొందుతుంది.
3. రోజ్ వాటర్: వయసు మీరుతున్న చర్మానికి నీరు అవసరం ఎక్కువగా ఉంటుంది. రోజ్ వాటర్ బాటిల్ మీతో పాటు ఎప్పుడూ ఒకటి ఉంచుకొండి. గంట, రెండు గంటలకొకసారి ముఖంపై స్ప్రే చేస్తూ ఉండండి. ఏసి గదిలో ఉన్నప్పుడు ముఖంలో తేమ త్వరగా తగ్గిపోతుంది, కాబట్టి రోజ్ వాటర్ వాడకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
4. ఆరెంజ్: ఆరంజ్ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
5. అరటి: చర్మానికి పోషణ అందించడంలో అరటి బాగా పని చేస్తుంది. అరటి పండును పేస్ట్‌గా చేసి చర్మానికి పట్టిస్త్తే ఐరన్ తదితర పోషకాలు అందుతాయి. దీన్ని రోజు వాడితే చర్మంలో సరికొత్త నిగారింపు కనబడుతుంది.
6. ఆముదం నూనె: ముడతలు తొలగించడానికి ఆముదం నూనె చాలా ఉపయోగపడుతుంది. మీ ముఖానికి రోజూ ఆముదం రాయడం మరవకండి, దీంతో చర్మానికి మృదత్వం , మెరుపు వస్తాయి.
7. నీటి ఆవిరి: వారంలో కనీసం ఒకసారైనా మీ చర్మానికి ఆవిరి పట్టించంది. కావాలనుకుంటే స్లీమ్‌బాత్ చేయండి. దీంతో మీ చర్మంలో తేమ నిలిచి మృదుత్వం పెరగుతుంది.



Click it and Unblock the Notifications