Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అత్యంత ఆరోగ్య ప్రదాయిని..స్వీట్ కార్న్...!

మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. దీనిలో ఉండే "పాలిఫెనాల్స్ మంచి యాంటి ఆక్సిండెంట్స్ గా పనిచేస్తుంది . కొన్ని అనారోగ్యాలకు ఉపశమనంగానూ, నివారణగానూ పని చేస్తుంది మొక్కజొన్న. లేత మొక్కజొన్న తేలికగా జీర్ణమవుతుంది. దీన్ని నమిలి తినడం వల్ల దంతాల పటుత్వం పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ, దృఢత్వానికీ ఉపయోగించే కాల్షియం, భాస్వరం ఇందులో ఉన్నాయి. డయాబెటీస్ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఇది కాన్సర్ ,గుండె సంబంద సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. మొక్కజొన్నలో ఉండే తీపి పదార్థం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి అనిపించినప్పుడు ఒక కప్పు ఉడికించిన గింజలు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు స్వీట్ కార్న్ లో ఉన్నాయి. విటమిన్ బి1, బి5, సి, ఫోలేట్, ఫాస్పరస్, పీచు పదార్థం, మాంగనీస్, ఖనిజలవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఆహారంలో వీటిని తరచూ తీసుకోవడం వల్ల కాలేయం సమస్యలను దూరంగా ఉంచవచ్చు. కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి చర్మానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచతాయి.
రక్త కానాల క్షీనత కు కారణమయ్యే ఫ్రీ రాడికాల్స్ ను నశింపచేయడం లో బాగా ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు స్వీట్ కార్న్ ను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకంను నివారిస్తుంది . కాలరీస్ చాల తక్కువగా ఉన్న మొక్కజొన్నలు తినేటప్పుడు కడుపు నింపుతుంది కాని శరీరాన్ని పెంచదు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ రాత్రిపూట కప్పు గింజలు తీసుకుంటే శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది.
కొవ్వు చాల తక్కువగా ఉండే ఈ మొక్కజొన్నలు తినడం వల్ల ఉఉబకాయము రానివ్వదు. ఇది షుగర్ ఫ్రీ --- మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాల మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications