Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
ఓట్స్ ను ఆరోగ్యకరంగా-రుచికంగా తీసుకోవడానికి టిప్స్
ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగనిస్తున్నారు. మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్నపేషంట్స్ కు ఓట్స్ ఒక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి ఆహారపదార్థం. అయితే కొంత మంది ఓట్స్ తినడానికి ఇష్టపడరు . కొంత మందికి ఓట్స్ ను ఒకే పద్దతిలో తయారుచేసుకొని తినడానికి ఇష్టపడరు. కానీ, ఓట్స్ ను ఆరోగ్యకరంగా తయారుచేసుకొని తినడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే ఓట్స్ ను ఆరోగ్యకరంగా, రుచికరంగా ఎలా వండుకొని తినాలో తెలుసుకోవాలి.
సాధారణంగా, ఓట్స్ చిరుదాన్యంతో తయారుచేసిన బ్రేక్ ఫాస్ట్. అయితే ఎప్పుడు ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ కు మాత్రమే తీసుకోనవసరం లేదు . అది మీ మధ్యహ్నా భోజనంలో లేదా రాత్రి డిన్నర్ కు తీసుకోవచ్చు. ఓట్స్ ను ఆరోగ్యకరమైన వంటలు తయారుచేసుకోవడానికి మార్గాలు తెలుసుకుంటే, అప్పుడు ఓట్స్ తో తయారుచేసే వంటలు ఒక వర్సిటైల్ ఫుడ్స్ లో మీ రెగ్యులర్ ఫుడ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ఓట్ మీల్ ను వివిధ రకాలుగా తయారుచేసుకోవడానికి సృజనాత్మకమైన ఐడియాస్ ను తెలుసుకోవాలి.
బియ్యం మరియు గోధుకలాగే, ఓట్స్ ఒక తృణధాన్యం. మీ రెగ్యులర్ డైట్ నుండి అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ను తొలగిస్తుంది . ఓట్స్ ప్లెయిన్ గా పాలతో కలుపుకొని తినడం మాత్రమే కాకుండా రుచికరంగా వివిధ రకాలా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను జోడించి తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు, ఓట్స్ ను చికెన్ మరియు గుడ్ల కాంబినేషన్ తో కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు ఓట్స్ కు కొంచెం నిమ్మరసం మిక్స్ చేసి తీసుకొన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఓట్స్ ను తినడానికి, ఓట్స్ ను మరింత రుచికరంగా తయారుచేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి...

ఆపిల్-ఓట్స్ పోర్డ్జ్:
ఐరన్ మరియు మినిరల్స్ వంటి వాటికి ఒక గోధాము లాంటిది ఆపిల్. కాబట్టి, ఈ రెండింటి కాంబినేషన్ లో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఒక ఆరోగ్యకరమైన ఎంపిక మరియు బోర్ లేకుండా ఉంటుంది.

ఓట్స్ విత్ లెమన్:
మీరు డయాబెటిక్ వారైతే, ఓట్స్ తో మరే ఇతర కాంబినేషన్ ఆహారాలు చేర్చకండి . నిమ్మరసం టాపింగ్ గా చిలకరించి తీసుకోవచ్చు. నిమ్మరసంతో పాటు కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు.

ఓట్ మీల్ సూప్:
మీరు అనారోగ్యానికి గురైనప్పుడు, జ్వరం నుండి త్వరగా కోలుకోవాలనుకున్నప్పుడు, ఓట్ మీల్ సూప్ ఒక అద్భుతమైన ఎంపిక. వెజిటేబుల్ లేదా చికెన్ బొర్త్(చికెన్ సూప్) ను తయారుచేసి, ఆ సూప్ లో ఓట్స్ ఉడికించి తీసుకోవచ్చు. మీకు టేస్ట్ తో పాటు మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి.

మసాలా ఓట్స్:
చాలా మంది అభిప్రాయం ప్రకారం ఓట్స్ ఎటువంటి రుచిని కలిగి ఉండవు. కాబట్టి, ఓట్స్ ను కొన్ని ఇండియన్ మసాలా దినుసులు ఛాట్ మసాలా, పెప్పర్, జీలకర్ర, మరియు డ్రై మ్యాంగో పౌడర్ ఉపయోగించి, ఓట్స్ ను మరింత రుచికరంగా తయారుచేసుకోవచ్చు.

ఓట్స్ పోరిడ్జ్:
ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ చాలా ఆరోగ్యకరం. మరియు గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి, ఈ రెండిటి కాంబినేషన్ లో తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ లోక్యాలరీ మరియు అధిక న్యూట్రీషియట్స్ కలిగి ఉంటాయి.

ఓట్స్ ఇండ్లీ:
ఇడ్లీలను బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇండ్లీ పిండి తయారుచేయడం కోసం బియ్యంకు బదులు, ఓట్స్ ను ఉపయోగించండి . మరియు కొన్నిమసాలాలను జోడిస్తే మరింత రుచికరంగా ఉంటుంది.

ఓట్స్ విత్ చికెన్ కర్రీ:
ఇండియన్ హోంలో చికెన్ కర్రీ ఒక స్టాపెల్ ఫుడ్. కాబట్టి, హెల్తీ చికెన్ స్టీవ్ కర్రీతో రైస్ కు బదులుగా ఓట్స్ తీసుకోండి.

ఓట్స్ విట్ డ్రై ఫ్రూట్స్:
నట్స్ మరింత ఆరోగ్యకరమైన స్నాక్ ఫుడ్ ఇవి మనకు తగినంత ఎనర్జీన్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి . కాబట్టి, టాపింగ్ కోసం, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, మరియు ఫిగ్స్ వేసుకొని తీసుకొంటే, అధిక ఎనర్జీ పొందవచ్చు.

ఓట్స్ ఫ్రూట్ సలాడ్:
ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనవి వీటితో పాటు ఆరోగ్యకరమైన పండ్లను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మరింత రుచికరంగా మరియు పూర్తి న్యూట్రిషియన్స్ అందుతాయి.

ఓట్ -బెల్ పెప్పర్:
ఓట్స్ బెల్ పెప్పర్ లో యాంటీఆక్సిడెట్స్ పుష్కలంగా ఉంటాయి. మరియు లోక్యాలరీ ఫుడ్. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో తీసుకోవచ్చు.

ఓట్స్ ఊతప్పం:
ఊతప్పు ఇండియన్ పాన్ కేక్, దీన్ని బియ్యంపిండితో తయారుచేస్తారు. బియ్యం పిండికి బదులుగా, ఓట్స్ ఉపయోగించి తయారుచేసుకొనే ఊతప్పం లోక్యాలరీ మరియు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఓట్స్ పాయసం:
ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ స్వీట్ డిష్. మరియు ఓట్స్ తో ఖీర్ లేదా పాయసంను చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

దోస:
దోస సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ . దీన్ని బియ్యంపిండితో తయారుచేస్తారు. బియ్యం పిండికి బదులుగా, ఓట్స్ ఉపయోగించి తయారుచేసుకొనే దోసెలు లోక్యాలరీ మరియు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఓట్స్ కిచిడి:
కిచిడి, బియ్యం, పప్పులతో తయారుచేస్తారు. బియ్యం కు బదులుగా ఓట్స్ తో తయారుచేస్తే చాలా టేస్టీగా మరియు హెల్తీగా మరియు రిచ్ మీల్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications