Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
వర్కవుట్స్‌కు ముందు ఉప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బరువు తగ్గాలనుకునే వారు కేవలం వ్యాయామం చేస్తూ ఉంటే సరిపోదు. డైట్ పాటించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు తక్కువుండే వాటినే తినాలి. పోషకాలు ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారాలు సమయపాలనతో తినడం ద్వారా బరువు తగ్గవచ్చు.

వ్యాయామానికి ముందు, వ్యాయామం తర్వాత ఎప్పుడు ఏం తినాలో కచ్చితంగా తెలిసుండాలి. కఠినమైన డైట్ పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే ఉప్పు కూడా బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి అసలు ఉప్పు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు ఆరోగ్య ప్రయోజనాలు:
ఉప్పు మానవ ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. ఇది రక్తపోటు, ద్రవ సమతుల్యత, కండరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామ సమయంలో చెమట పట్టినప్పుడు, చెమట ద్వారా ఒంట్లోని ఉప్పు కోల్పోతారు. ఇది డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరికి, అలసటకు దారి తీస్తుంది. వ్యాయామానికి ముందు ఉప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు అలాగే పనితీరు మెరుగుపరచుకోవచ్చు.
వర్కవుట్స్‌కు ముందు ఉప్పు తింటే కలిగే ప్రయోజనాలు:
1. మెరుగైన హైడ్రేషన్:
ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ను నివారించడానికి ఇది చాలా కీలకం. డీహైడ్రేషన్ వల్ల అలసట, తిమ్మిరి, హీట్ స్ట్రోక్‌కు దారితీస్తుంది.
2. కండరాల బలం పెరుగుతుంది:
ఉప్పు కండరాలను కుదించడానికి సహాయపడుతుంది. భారీ బరువులు ఎత్తడానికి, ఎక్కువ సేపు హై ఇంటెన్సిటీతో వర్కవుట్స్ చేయడానిక సహాయపడుతుంది.
3. కండరాల అలసట తగ్గుతుంది:
చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఇది కండరాల అలసటను తగ్గించడానికి, ఎండ్యురెన్స్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
4. పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది:
వ్యాయామం సమయంలో పనితీరును మెరుగుపరచడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది హైడ్రేషన్, కండరాల బలం, ఎండ్యురెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వ్యాయామానికి ముందు ఎంత ఉప్పు తీసుకోవాలి?:
వ్యాయామానికి ముందు ఎంత ఉప్పు తీసుకోవాలనేది పూర్తిగా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. అర లీటరు నీటిలో సగం టీస్పూన్ ఉప్పు తీసుకోవడం మంచిది. దీని వల్ల కలిగే ప్రభావాలను గమనించుకుని కొంత మొత్తంలో ఉప్పును పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం హానికరం. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలూ వస్తాయి. కాబట్టి పరిమితంగా తీసుకోవడమే మంచిది. అతి ఏ విషయంలోనూ పనికిరాదు. ఆరోగ్యానికి మంచివైనా పరిమితంగానే తీసుకోవాలి.
వ్యాయామానికి ముందు ఉప్పు ఎలా తీసుకోవాలి:
పుష్కలంగా నీరు తాగాలి:
ఉప్పు తీసుకునేటప్పుడు పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. దీని వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు.
కొద్ది మొత్తంలో ప్రారంభించాలి:
వ్యాయామానికి ముందు ఉప్పు తీసుకోవడం ప్రారంభిస్తుంటే.. కొద్ది మొత్తంలో ప్రారంభించడం కీలకం. క్రమంగా పెంచుకుంటూ పోవాలి.
శరీరం చెప్పేది వినాలి:
డీహైడ్రేషన్ కు గురికావడం, వాంతులు, వికారం, మైకం లాంటి ఏవైనా ప్రతికూలతలు కనిపిస్తే వ్యాయామానికి ముందు ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి లేదా ఆపేయాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications