Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు బరువెక్కుతున్నారనటానికి 5 నిదర్శనాలు!

1. ఒక్క ఫర్లాంగు దూరం నడకకు లేదా మెట్లు ఎక్కినపుడు అలసిపోతున్నారా? వ్యాయామం చేయకపోవటం కూడా అధికబరువునిస్తుంది. అదనంగా వున్న కొవ్వు చర్మం కింద చేరి శరీరానికి ఒత్తిడినివ్వటం లేదంటే శరీర కిందిభాగమైన కాళ్ళకు నొప్పి కలిగించటం చేస్తుంది.
2. నడిచేటపుడు మీ తొడలు ఒకదానికొకటి తగులుతున్నాయా? సాధారణంగా కొవ్వు కణాలు పిరుదులవద్ద, తొడల వద్ద చేరతాయి. కనుక మీ తొడలు నడిచేటపుడు ఒకదాని కొకటి తగులుతున్నాయంటే ఖచ్చితంగా మీరు వెయిట్ పెరుగుతున్నారన్నమాటే.
3. మీ ముఖం గుండ్రంగా తయారవుతోందా? లేక డబుల్ ఛిన్ వస్తోందా? బరువు పెరుగుతుంటే దాని మొదటి చిహ్నం ముఖంలో కనపడుతుందంటారు. ముఖం ఉబ్బినా లేక పాలిపోయినా, ఆ వ్యక్తికి కొవ్వు పేరుకుంటోందని చెప్పచ్చు. డబుల్ ఛిన్ కూడా వెయట్ పిరిగారంటానికి నిదర్శనమే.
4. మహిళలకు వెయట్ పెరిగారనటానికి మరో నిదర్శనం వీపు భాగంలో కొవ్వు. వీపు వెనుక పక్కలకు వేలాడే టైర్లు మహిళలు తమకిష్టమైన దుస్తులు కూడా ధరించకుండా చేస్తాయి. దుస్తులు టైట్ అయితే చాలామంది స్త్రీలు ఊపిరి కూడా తీసుకోలేరు. ముందుభాగంలో బటన్స్ కల షర్టులు వేసుకోవాలంటే అవి ఎపుడు ఊడతాయోనని భయపడుతూ వేసుకోవాల్సిందే.
5. మీరు ఇష్టపడి కొనుక్క్కున్న జీన్స్ పేంట్ బటన్లు పట్టటం లేదంటే, పొట్టలో కొవ్వు పేరిందన్నమాటే. పొట్టలో చేరిన కొవ్వు పేంటు జిప్పులను లేదా బటన్లను పట్టనివ్వదు. వీరు కూర్చోవాలంటే చాలా కష్టంగా కూడా వుంటుంది.
కనుక నేను లావెక్కానా? అని ప్రశ్నించుకుంటున్నారంటే... పైన చెప్పిన అంశాలు సరి చూసుకోండి. సమాధానం మీకే దొరుకుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications