Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒళ్ళు తెలీకుండా తినేస్తున్నారా?

దీని ప్రభావం ఎలా వుంటుంది?
లావెక్కుతారు. ఇది శారీరక, మానసిక ఒత్తిడికి దోవతీస్తుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే పోషకాహార లేమి సంబంధిత వ్యాధులు వస్తాయి. అధిక షుగర్, పిండిపదార్ధాలు నిలబడటం వంటివి జీవప్రక్రియను మారుస్తాయి. ఫలితంగా శరీరంలో షుగర్ లెవెల్స్ మారుతూంటాయి. పురుషులకంటే కూడా మహిళలు ఈ రకమైన ఆవేశపూరిత తిండ్లు అధికంగా తింటున్నారట. దానితో లావెక్కటం, లావెక్కామన్న ఆందోళన, మానసిక వేదన, గుండె సంబంధిత వ్యాధులు కూడా తెచ్చుకుంటున్నట్లు పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
పరిష్కారం!
ఆహారం తింటే హాయిగా వుండే భావన కలగాలి. కాని ప్రస్తుతం తినేవారు, ఆందోళన, తప్పు చేశామన్న ఫీలింగు, ద్వేషం, మానసిక వేదన లేదంటే టి.వి.పై ధ్యాస మొదలైనవాటితో భుజిస్తున్నారు. అవన్ని వున్నప్పటికి వాటిని సరి చేసుకుని తినటం ప్రధానమంటున్నారు నిపుణులు. ఆకలి లేనపుడు, అప్ సెట్ అయినపుడు భాగస్వామితో మాటలు సరిగా లేనపుడు తినవద్దు. భావావేశాలతో తినేస్తే కలిగే పరిణామాలను వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు కూడా సరి చేయలేవు. అధిక బరువు పొందటం, వ్యాధులు కలిగి వుండటం వాటికి ఆహార, వ్యాయామ నిపుణుల వద్దకు పరుగులు పెట్టేకంటే, చక్కని మానసిక వైద్యుడి సలహాలు పొందటం మంచిదని కూడా వీరు తెలియజేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications