Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కాంతులీనే చర్మం మీ సొంతం!

1. తీసుకునే ఆహారంలో పీచు అధికంగా వుండాలి. ఇది శరీరంలోని విష పదార్ధాలను తొలగించి చర్మాన్ని కాపాడుతుంది. పీచు అధికంగా, కేరట్లు, కేబేజి, బీట్ రూట్, బ్రొక్కోలి, చిక్కుడు గింజలు, ఉల్లిపాయ, బంగాళదుంప, గోంగూర, కాలీఫ్లవర్ మొదలగు వాటిలో వుంటుంది. పండ్లలో ఆపిల్, అరటిపండు, అవకాడో, స్త్రాబెర్రీలు, రేగుపండు్ల, ఆరెంజ్, ద్రాక్ష, బ్లూ బెర్రీస్, చిన్నరేగి, పియర్ బాదం, మొదలైనవి అధికంగా పీచు కలిగి వుంటాయి. వీటిని మీ ఆహారంలో భాగంగా చేయండి.
2. వెల్లుల్లి, అల్లం మొటిమలు తగ్గటానికి బాగా తోడ్పడతాయి. కనుక వీటిని మీరు తినే ఆహార పదార్ధాలకు జోడించండి.
3. తీసుకునే ఆహారం లో ప్రొటీన్లు అధికంగా వుంటే అవి ఎంజైములను పెంచి నూనె గ్రంధులను నియంత్రించటం, చర్మ రంధ్రాలు స్వేచ్చగా వుండటంలో తోడ్పడతాయి. సంపూర్ణమైన బ్రెడ్, బీఫ్, గుడ్లు, చేప, జున్ను, కొబ్బరి, ఉడికించిన గించలు కేరట్లు, అవకాడో, బాదం మొదలైనవి ప్రొటీన్లు అదికంగా కలిగా వుంటాయి.
4. విటమిన్లు అధికంగా వుండే కూరలు, ఆకు కూరలు, చిలకడదుంప, కార్న్, మాంసం, సీఫుడ్, మామిడి పండ్లు, బొప్పాస, టొమాటో, ఓట్లు వీటిలో విటమిన్లు వుంటాయి. జింక్ అధికంగా వుండే ఆహారం కూడా తీసుకోవాలి.
5. గ్రీన్ టీలో వుండే ఔషధ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే వీరికి చాలా మంచిది. చర్మం కాంతివంతంగాను, జుట్టు బలంగా కూడా ఎదుగుతాయి.
6. శరీరంలోని అధిక అయోడిన్ తగ్గించాలి. నూనె తిండ్లు, లేదా చిప్స్ తినరాదు.
7. ప్రతి రోజూ 8 నుండి 10 గ్లాసులు నీరు అంటే సుమారుగా 3 లీటర్ల నీరు తాగి శరీరంలోని మలినాల్ని విసర్జించాలి.
8. ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం దానితోపాటు ఎనిమిది గంటల నిద్రలు పై ఆహారంతో పాటు కలిగి వుంటే మొటిమలు పూర్తిగా నివారించటమే కాక, కాంతులీనే చర్మం, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications