Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువెక్కకుండా తెలివిగా తినేయండి?

1. హోటళ్ళు, రెస్టరెంట్లలో తినేవారు వీలైనంతవరకు నూనెలో వేయించిన వేపుళ్ళు, పెనంపై కాల్చిన పదార్ధాలు తినవద్దు. దానికి బదులు, ఉడికించిన ఆహారాలు తినండి. చికెన్ వంటి పదార్ధాలు కూడా, ఛీస్ వంటి వాటితో కాక, మితంగా వేయించిన సైడ్ డిష్ లతో తినండి.
2. భోజనానికిముందు ఒక గ్లాసెడు నీరు తాగేస్తే జీర్ణ ప్రక్రియకు తోడ్పడటమే కాక కడుపు నిండినట్లు భావించి బయటి పదార్ధాలు తక్కువ తింటారు.
3. మీరు ఆర్డర్ చేసే వంటకంలో ఏం వుంటాయనేది సర్వర్ ను అడగండి. కొవ్వు రహిత డిష్ లు చెప్పమనండి. సలాడ్ లేదా సూప్ వంటివే అధికంగా తింటూ మెయిన్ వంటకం తగ్గించండి.
4. స్నాక్స్ గా బ్రెడ్ రోల్స్, ఛీజ్ వంటివి తినవద్దు. వైట్ బ్రెడ్ కు బదులు బ్రౌన్ బ్రెడ్ కోరండి.
5. తినే పదార్ధం ఎంత ముఖ్యమో ఎంత నెమ్మదిగా తింటున్నారనేది కూడా అంతే ముఖ్యం. కనుక మెల్లగా నమలండి, ప్రతి ముద్దా ఆనందించండి. బ్రెయిన్ 20 నిమిషాలు తింటే గాని పూర్తయినట్లు భావించదు. కనుక మెల్లగా తింటే, అధిక మొత్తం లోపలికి పోకుండా వుంటుంది.
6. మనలో చాలామంది బఫే లంచ్ చేస్తారు. పాస్తాలు, ఛీజ్, బటర్, క్రీమ్, నెయ్యి వంటివి వదిలేసి సలాడ్లు, వెజిటబుల్స్, నూనె తక్కువగా వుండే రోటి, పాల ఉత్పత్తులైన పెరుగు, పెరుగు పచ్చడి వంటివి ఆరోగ్యకరంగా తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications