Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జాగింగ్.....ఒక గొప్ప వ్యాయామం!

1.జాగింగ్ షూస్ వేసుకొని వెంటనే గ్రౌండ్ కు వెళ్ళిపోవటం కాదు. దానికి ముందు కొద్దిపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. జాగింగ్ తర్వాతే స్ట్రెచింగ్ చేయాలనే భావన దూరం చేయండి. ముందుగా స్ట్రెచింగ్ చేస్తే...అది బెణుకులను లేదా గాయాలను కలుగకుండా చేస్తుంది.
2. జాగ్ చేయాలంటే...ఉదయం వేళ మంచి సమయం. అది మీ జీవక్రియ పెంచి రోజంతా శక్తితో వుండేలా చేస్తుంది.
3. జాగింగ్ బాగా చేయాలంటే, జాగింగ్ షూస్ వేసుకోండి.
4. కొత్తగా మొదలు పెట్టినవారు ఆరంభంలో మెల్లగా నడిచి, నడక వేగం పెంచుతూ, క్రమంగా జాగింగ్ కు రావాలి. జాగింగ్ సమయంలో మూడ్ బాగా వుండాలంటే, మ్యూజిక్ వినండి.
5. కొత్తగా జాగ్ మొదలు పెట్టేవారు ఎత్తు, పల్లాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. కాళ్ళపై ఒత్తిడి లేకుండా వుంటుంది.
6. బెణుకులు వంటివి లేకుండా వుండాలంటే...మెల్లగా మొదలు పెట్టి క్రమేణా వేగం పెంచాలి.
7. జాగింగ్ కు వెళ్ళే అరగంట ముందు నీరు తాగండి. శరీరం డీహైడ్రేషన్ పొందకుండా వుంటుంది. నీరు అధికంగా తాగితే, వేగం తగ్గుతుంది.
8. ఫలితాలు బాగుండాలంటే, ఖాళీ పొట్టతో చేయండి. వేగం వచ్చి కేలరీలు బాగా తగ్గుతాయి.
9. మునికాళ్ళపై జాగ్ చేయాలి కాని మడమలపై కాదు.
10. జాగింగ్ చేసిన తర్వాత కూడా కొద్ది పాటి స్ట్రెచింగ్ చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications