Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీరం వేడెక్కిస్తే...కొవ్వు తగ్గటం ఖాయం!

విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. దీనికి మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచుతుందట. ఐరన్‌లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో కూడిన సలాడ్ తీసుకుంటే ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుందని వైద్యులు చెపుతున్నారు.అలాగే, వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటివి కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయట. ఈ వేడి శరీర జీర్ణక్రియలో కొద్దిపాటి వృద్ధిని కలిగిస్తుంది. దీనివల్ల బాడీలో ఫ్యాట్ తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు.
ప్రధానంగా టమోట, కీరదోస, గుమ్మడిల్లో తక్కువ కేలరీస్ ఉంటాయి. కానీ, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఫైబర్ జీర్ణమవ్వడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటితో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియను, శక్తిని స్థాయిలో ఉంచుతాయని పేర్కొంటున్నారు. వీటితో పాటు.. బాదంపప్పు, కొబ్బరి నూనె, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్, తేనె, మజ్జిగ, వెల్లుల్లితో కూడా శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని గృహ వైద్యులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications