Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హేంగోవర్ నివారణకు నాలుగు వ్యాయామాలు!

హేంగోవర్ ను తగ్గించే వ్యాయామాలు
పరుగుపెట్టటం - హేంగోవర్ దిగాలంటే, ఉదయం వేళ వేగంగా పరుగుపెట్టండి. అది మీ రక్తప్రసరణ అధికం చేస్తుంది. గుండె బాగా కొట్టుకునేలా చేస్తుంది. పరుగులో మీరు అధిక ఆక్సిజన్ తీసుకుంటారు. అది మీ లోని సోమరితనాన్ని పోగొట్టి, తాజాగా వుండేలా చేస్తుంది. దీనినే వ్యాయామం తర్వాతి అధిక ఆక్సిజన్ తీసుకోవటం అని వైద్య పరిభాషలో అంటారు.
స్విమ్మింగ్ - హేంగోవర్ నివారించుకోవాలంటే, చల్లని నీటితో స్నానం చేయాలి. అయితే, మీ సోమరితనాన్ని, నొప్పులను నివారించుకోవాలంటే, ఒక స్విమ్మింగ్ పూల్ లో వేగంగా స్విమ్మింగ్ చేయండి. చల్లని నీరు శరీరానికి తగిలితే అది మీలోని ఎడ్రినాలిన్ పెంచుతుంది. ఎడ్రినాలినన్ పెరిగితే హేంగోవర్ వెంటనే దిగిపోతుంది. స్విమ్మింగ్ చాలామంది ఇష్టపడే అరబిక్ వ్యాయామం. అది శరీరం అధికంగా శ్రమ పడకుండాలనే మిమ్మల్ని ఫిట్ గా వుంచుతుంది. స్విమ్మింగ్ లో మొదట రెగ్యులర్ ఈత కొట్టండి. హాయి పొందగానే మీకిష్టమైన రీతిలో చేయండి.
జెర్క్ ప్రెస్ లు - ఇప్పటికే మీరు కండరాలు కలిగిన శరీరం వుంటే, మీరు ఆ కండలను చక్కగా కాపాడుకోవాలి. హేంగోవర్ కారణంగా మీరు డంబ్ బెల్స్ కూడా ఎత్తలేరు. కాని, తలనొప్పి కారణంగా మీరు వ్యాయామంపై శ్రద్ధ చూపలేరు. అపుడు మీరు జెర్క్ ప్రెస్ లను ఆశ్రయించాలి. ఈ వ్యాయామం సమర్ధవంతంగా మీ హేంగోవర్ ను తొలగిస్తుంది. ఈ వ్యాయామంలో, తిన్నగా నించోండి. కెటిల్ బెల్ లేదా డంబ్ బెల్ మీ కుడిచేతితో పట్టుకొని ఛాతీ వైపు లాగండి. మోకాళ్ళను సగం వరకు వంచి కూర్చొనండి. ఈ భంగిమలు పది నుండి 15 సెకండ్లపాటు వుంచాలి. ఒక సారి కుడి, మరొకసారి ఎడమ భంగిమలను ఆచరించండి. ఈ వ్యాయామం కనుక ఒక్క పది నిమిషాలపాటు చేస్తే, మీ తలనొప్పి, శారీరక నొప్పులు వెంటనే తగ్గిపోయి మంచి రిలీఫ్ వుంటుంది.
సైకిలింగ్ - హేంగోవర్ వున్న ఉదయంవేళ, ఆఫీస్ లేదా మీ పని ప్రదేశాలకు కారు లేదా బైక్ ఉపయోగించేకంటే, సైకిలు వాడండి. ఆరోగ్యకరంగా మంచి శరీరం కలిగి వుండాలంటే, సైకిలింగ్ చాలా మంచిది. సైకిలింగ్ ఒత్తిడిని, అధిక బరువును కూడా తగ్గిస్తుంది.మీ ఎనర్జీ స్ధాయిలు బాగా పెరుగుతాయి. హేంగోవర్ తగ్గటానికే కాదు, ప్రతినిత్యం మీరు ఆరోగ్యంగా వుంటూ, వ్యాధులు దగ్గరకు రాకుండా వుండాలంటే సైకిలింగ్ వ్యాయామం బాగా పనిచేస్తుంది.
హేంగోవర్ తగ్గించుకోవాలంటే, ఈ వ్యాయామాలు చేయండి. తగినంత నీరు లేదా ద్రవాహారాలు తీసుకొని శరీరంలో లిక్కర్ తాగడం వలన ఏర్పడిన డీహైడ్రేషన్ తొలగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications