Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నలభై పైన పడిన మహిళలకు 5 ఆహారాలు!

కొవ్వులు పూర్తిగా ఉండే ఆహారాలు మిమ్మల్ని రెండు ప్రధాన కారణాలుగా స్లిమ్ గా ఉంచుతాయి. అవి మిమ్మల్ని చాలాసేపు కడుపు నింపి ఉంచటం చేస్తాయి. బటర్ వంటి ఆహారాలు మీకు ఎపుడూ బ్రెయిన్ లో కడుపు నిండింది అనే సిగ్నల్స్ ఇస్తాయి. కాని డైటింగ్ ఆహారాలు అంటే నిలువ వుండేందుకు వేసిన పదార్ధాలతో కలవి లేదా షుగర్ కలవి మీకు ఆకలి కలిగిస్తాయి. కొవ్వు పూర్తిగా ఉండే ఆహారాలు తినటం కష్టం. జున్ను లేదా డార్క్ చాక్లెట్ వంటివి అధికంగా తినలేము.
ఫ్రాన్స్ దేశంలో 76 శాతం మహిళలు ఇంటిలో తయారైన ఆహారమే తింటారు. ఈ ఆహారాలలో ఉప్పు, షుగర్, లేదా నిలువ రసాయనాలు అతి తక్కువగా మాత్రమే ఉంటాయి. కనుక మొదటి అంశంగా సన్నగా నాజూకుగా ఉండాలనుకునే వారంతా ఇంటి ఆహారమే తినాలి. వాటికి రెడీమేడ్ సాస్, పస్తా, లేదా ఇతర వేపుడు వంటకాలు జతచేయకండి. తాజా, సహజ రుచికిగాను తరిగిన టమాటాలు లేదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వంటివి చేర్చి తినండి.
ఫ్రాన్స్ మహిళలు డైటింగ్ చేయకపోయినా, వారు తినే ఆహార పరిమాణాన్ని లెక్కించుకుంటారు. ఫిలడెల్ఫియా, ప్యారిస్ లలోని వారి రెస్టరెంట్ మరియు సూపర్ మార్కెట్ లలో జరిగిన ఒక సర్వే మేరకు, తినే ఆహారపరిమాణం అమెరికా వారితో పోలిస్తే 25 శాతం తక్కువని తేలింది. అంతేకాక, కూల్ డ్రింక్ ల వంటివి 52 శాతంతక్కువని, పెరుగు 82 శాతం తక్కువని కూడా తేలింది. పెట్టుకునే మొత్తం అధికంగా ఉంటే మీకు అధికంగా తినాలనిపిస్తుంది. ఆకలితో నిమిత్తం లేకుండా తినేస్తారు. కనుక బరువు తక్కువగా ఉండాలంటే, కొద్దిగా పెట్టుకొని తినాలి. వీరు తినే కార్బో హైడ్రేట్లు ఒకటి లేదా రెండు అరచేయిలకి మాత్రం సరిపోతాయి. అంతకంటే అధికంగా వీరు తినరు.
ఒక ఫ్రెంచి మహిళ భోజనం ముందు కనీసం అంటే రెండు గంటలు కూర్చుంటుంది. అతి మెల్లగా నమిలి భుజిస్తుంది. అలా తినటం బోర్ అనిపిస్తే, ఆసక్తికర కబుర్లు చెప్పుకుంటూ రెస్టరెంట్ లు లేదా హోటళ్ళలో దీర్ఘకాలం కూర్చుని తింటారు. మరి వీరిలో 40 సంవత్సరాలు పైబడిన వారి ఆహారం ఎలా ఉంటుంది?
గుడ్లు - విటమిన్ ఇ అధికంగా ఉండే గుడ్డు తింటారు. ఇది దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తుంది.
ఖర్జూర పండు - వీటిలో విటమిన్లు ఎ, బి మరియు సి పుష్కలంగా ఉండి జీర్ణక్రియ బాగా పెంచుతాయి.
బాదం పప్పులు - ముడుతలను తొలగించే బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ప్రతిరోజూ పది లేదా పన్నెండు బాదం పప్పులు తింటారు.
బెర్రీలు - రంగు రంగుల బెర్రీలు బ్లూ బెర్రీలనుండి స్ట్రా బెర్రీల వరకు తింటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వారి శరీర వయస్సు కనపడకుండా చేస్తాయి.
అవకాడోలు - ఈ పండులో కూడా విటమిన్లు సి మరియు ఇ ఉంటాయి. అవి మీ చర్మం మందం అవకుండా చేస్తాయి.
వయసు పైకి కనపడకూడదనుకుంటే ఈ క్రిందివాటిని వదిలేయండి....
స్మాకింగ్ - పొగతాగే వారు శరీరం లోపల, బయట కూడా త్వరగా ముసలి అవుతారు.
ఆల్కహాల్ - ఆల్కహాల్ తాగేవారికి చర్మం డీ హైడ్రేషన్ కారణంగా ముడుతలు పడి మెటబాలిజం క్రియ తగ్గుతుంది. నడుముకు కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.
షుగర్ - రిఫైన్ చేసిన తెల్లని షుగర్ మీ చర్మంలోని కొలేజన్ నాశనం చేస్తుంది. ఈ చర్య ముడుతలకు కారణం అవుతుంది.
ఒత్తిడి - ఒత్తిడి, ఆందోళన త్వరగా ముసలివారయ్యేలా చేస్తాయని స్టడీలు చెపుతున్నాయి. ఒత్తిడి తక్కువగా ఉండేవారు ఎల్లపుడూ చిన్నగా కనపడతారు.
కూల్ డ్రింక్ లు - నురగలు కక్కే కూల్ డ్రింకులలో నిలువ ఉండేందుకు వేసే పదార్ధాలు మీ ఎముకలలోని కాల్షియం తినివేసి ముసలివారిగా కనపడేలా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications