Latest Updates
-
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే!
సన్నపడాలంటే బీచ్ వ్యాయామాలు!

చక్కని అంగసౌష్టవం కల శరీరం పొందటానికి 5 బీచ్ వ్యాయామాలు
1. నీటిపై పరుగు - జిమ్ లో ట్రెడ్ మిల్ పై ఎలా పరుగెడతారో, అదేవిధంగా సముద్రపు ఒడ్డున నీటిపై పరుగు పెట్టండి. ఎంతో తమాషాగా వుంటుంది. నీటి శబ్దం, మీ శరీరంపై నీటి చల్లదనం వంటివి ఆనందం కలిగిస్తాయి. అయితే, సముద్రపు ఒడ్డున పెట్టే ఈ పరుగు సమయంలో అలల తాకిడి గమనించండి. మడమలోతు నీటిలో పరుగుపెడితే చాలు ఆనందంగా వుంటుంది.
2. గుండె వ్యాయామం - శరీరం వేడెక్కిన తర్వాత గుండె సంబంధిత వ్యాయామాలు చేయండి. 200 మీటర్ల పరుగు చేయండి. ఇసుకలో పరుగెడతం చాలా కష్టం. కాళ్ళు కూరుకుపోతూంటాయి. అధిక శ్రమ పెట్టాల్సివస్తుంది. ఇసుకలో ఎపుడూ షూస్ లేకుండా పాదాలతోనే పరుగెత్తటమే సౌకర్యం.
3. బీచ్ లో స్కిప్పింగ్ - పరుగు వలెనే బీచ్ లో స్కిప్పింగ్ కూడా ఇసుక కారనంగా కష్టమే. అయినప్పటికి మీరు చేస్తూ వుంటే అది చాలా తేలికైపోతుంది.
4. మంచి అంగసౌష్టవం కావాలంటే గుండె వ్యాయామాలు చాలవు. కండరాల వ్యాయామాలు కూడా కావాలి. చేతులు ముందుకు చాచండి. కాళ్ళు వెడంగా వుంచండి. ఇపుడు ఒక కుర్చీలో కూర్చున్నట్లు మోకాళ్ళు వంచి కూర్చోండి. కొద్ది సెకండ్లు అలానే వుండి రిలాక్స్ అవ్వండి. ఈ వ్యాయామం కనీసం 8 నుండి 10 సార్లు చేయండి.
5. బీచ్ లో సిట్ అప్స్ - మీ చిన్న పొట్ట చదునైపోవాలంటే, సిట్ అప్స్, పొట్ట వ్యాయామాలు చేయాలి. బెల్లకిలా పడుకోండి. చేతులు ఛాతీపై పెట్టండి. శరీర పైభాగాన్ని పైకి లేపుతూ కింద శరీరం కదల్చకుండా పొట్టకు తల తాకించండి. ఈ వ్యాయామాలు పురుషులు నగ్నంగా చేసినా స్త్రీలు తమ సన్ బాతింగ్ దుస్తులతో చేస్తే, కావలసినంత విటమిన్ డి కూడా మీకు అందుతుంది.
ఈ బీచ్ వ్యాయామాలు చాలా తేలిక. మంచి ఫలితాలనిస్తాయి. తమాషాగానూ వుంటాయి. మీరు కనుక బీచ్ లో మరే వ్యాయామాలు చేసినా మీ అనుభవాలు మాకు తెలియపరచండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications