Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
సన్నపడటానికి... చిన్నపాటి... బీచ్ జాగింగ్!

సన్నని శరీరానికి బీచ్ లేదా పార్క్ వ్యాయామాలు -
1. నీటిపై పరుగెత్తండి - జిమ్ లో ట్రెడ్ మిల్ పై ఎలా పరుగుపెడతారో....అదే రకంగా, బీచ్ అయితే నీటిలో, పార్క్ అయితే, జాగింగ్ ట్రాక్ పై పరుగెత్తండి. ఎంతో ఎనర్జీ ఖర్చవుతుంది. నీరు కాలి మణికట్టు వరకు వచ్చి మీరు పరిగెట్టేటపుడు చిందుతుంటే హాయిగా వుంటుంది.
2. కొంత వ్యాయామం తర్వాత శరీరం వేడెక్కిన తర్వాత పరుగు పెట్టండి. బీచ్ వంటి ఇసుక వున్న ప్రదేశాలలో పరుగు కష్టమే. మీరు అధిక శ్రమ పెట్టాల్సివస్తుంది. అయినప్పటికి మెత్తటి ఇసుక కనుక పరుగుపెట్టవచ్చు. పరుగు కాలికి షూస్ లేకుండా కూడా చేయండి. గుండె వ్యాయామంగా బాగుంటుంది.
3. కొంతసేపు పరుగుపెట్టిన తర్వాత, ఒక మంచి స్కిప్పింగ్ రోప్ తో కొద్ది సమయం స్కిప్పింగ్ చేయండి. బాహ్య ప్రదేశాలలో స్కిప్పింగ్ చేయటం తేలిక. స్కిప్పింగ్ లో వున్న కష్టం కూడా మీకు తెలియకుండా చేసేస్తారు. ఈ వ్యాయామం కూడా గుండెకు మంచిది.
4. ఇంతవరకు మీరు చేసిన గుండె సంబంధిత వ్యాయామం మాత్రమే చాలదు. మంచి ఆకారం కల శరీరం కావాలనుకుంటే కండరాలు శ్రమించే వ్యాయామాలు అంటే కొన్ని అరబిక్ వ్యాయామాలు కూడా చేయండి. నిలబడి చేతులు ముందుకు, పక్కకు చాపటం, నడుము కిందకు, పక్కలకు వంచటం, కాళ్ళు రెండూ దూరంగా పెట్టి నడుము వంచి పక్కలకు కదలటం వంటివి చేయాలి. ఏది చేసినా 8 నుండి 10 సార్లు చేయండి.
5. సిట్ అప్ లు లేదా గుంజీలు - మీ చిన్నారి పొట్ట చదునుగా వుండాలంటే, కొన్ని గుంజీలు తీయండి లేదా పొట్ట వంచే వ్యాయామాలు చేయండి. వెల్లకిలా పడుకోండి చేతులు మీ ఛాతాభాగంపై పెట్టండి. మీ శరీర పైభాగాన్ని పైకి లేపుతూ తలను మోకాళ్ళకు తగిలిస్తూ పొట్టనుబాగా లోపలికి లాగండి. కింది శరీర భాగాన్ని పైకి కదల్చకండి. మీ శ్వాస సాధారణంగానే వుండేలా చూసుకోండి. పురుషులైతే ఈ వ్యాయామం షర్టు లేకుండాను, మహిళలు తమ చిన్నిపాటి దుస్తులతోను చేస్తే సూర్య రశ్మి కూడా సోకి అధికంగా విటమిన్ డి లభిస్తుంది. మంచి చర్మకాంతి చేకూరుతుంది.
ఈ రకమైన బీచ్, పార్క్ లేదా బహిరంగ ప్రదేశాలలో వ్యాయామాలు చేయటం మంచిదే. కనుక ప్రయత్నించి చూడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
