Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కండలు తిరిగిన చేతుల కొరకు!

బలమైన కండలుకల చేతులు పొందాలంటే....
1. మీ చేతులను తరచుగా శ్రమకు గురిచేయండి. బరువైన షాపింగ్ బ్యాగులు మోయటం, ఇతర వస్తువులు మోయటం చేయాలి. కంప్యూటర్ కీ బోర్డు చేస్తూ కూర్చుంటే చాలదు. కండలు కలిగిన వారు తమ చేతులతో ఎంతో శ్రమపడతారనేది గుర్తించండి.
2. మీకు కూడా కండలున్నాయని గ్రహించండి. కండలనేవి బాడీ బిల్డర్లకు సినీ యాక్టర్లకే కాదు అందరికి వుంటాయి. మనకు కూడా వున్నాయి. వాటిని సరైన ఆకారంలో పెట్టటానికి వ్యాయామాలు చేయాలి.
3. కొంత శ్రమగా వుండే పని చేయండి. చిన్న చిన్న పనులు చేస్తూ కూర్చుంటే బలం రాదు. కట్టెలు కొట్టాలా? పారతో గార్డెనింగ్ చేయాలా? ఆ పనులు ఇష్టంగా చేయండి. తప్పక మీకు శారీరక బలం ఏర్పడుతుంది.
4. ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలు తినాలి. ప్రొటీన్ ఆహారాలు కండలు ఏర్పరుస్తాయి. డైటింగ్ అంటూ ఆహారం మానేస్తే కండలు రావు. కండ కనపడాలంటే కొంత బరువు పెరగటం కూడా అవసరమే.
5. మీ కండరాలకు విశ్రాంతి నివ్వండి. మీ కండలు జిమ్ లలో తయారవ్వవు. కండపట్టేది మీరు విశ్రాంతిగా వున్నపుడే. కనుక తగినంత విశ్రాంతి, నిద్ర తీసుకోండి. కండలు ఉబికేటందుకు సమయం ఇవ్వండి.
6. శరీరంలోని అన్ని కండరాలు ఒకటిగా వుండవు. కొన్ని వేగంగాను మరికొన్ని నెమ్మదిగాను కండ పడతాయి. కనుక మీరు శ్రమించేటపుడు అన్ని అంగాలను ఉపయోగించండి.
7. కండలు కనపడేది చేతులపైనే అయినప్పటికి, శరీరంలోని అన్ని భాగాలకు మీరు శ్రమ కలి్పించాలి. బలమైన చేతులు, బలహీనమైన కాళ్ళు వుండరాదు. అలా వుంటే మీ శరీరం అందుకు సహకరించదు.
ఈ ట్రిక్కులు ఉపయోగించి మీ శరీరంలోని అన్ని అంగాలకు శ్రమ కల్పించి చక్కని శారీరక రూపం ఏర్పరచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications