Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కండలు పెంచాలంటే ఎంతో కష్టం!

1. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వారానికి కనీసం 4 లేదా 5 రోజులైనా చేయాలి. ఒక సారి మీ శరీరంలో కండ సౌష్టవం ఏర్పడిన తర్వాత కనీసం వారంలో 3 రోజులైనా చేయాలి.
2. సాధారణంగాబాడీ బిల్డర్లు జిమ్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. ప్రతిరోనజూ చేసే పది నిమిషాలు సమయం చాలదు. ప్రతిరోజూ గుండె సంబంధిత వ్యాయామాలు చేసి శరీరంలోని చెడు కొవ్వును తొలగించాలి. అపుడే మీ సామర్ధ్యం పెరుగుతుంది.
3. గతంలో ఎంత ఎక్కువ బరువు ఎత్తితే అంత బాగా కండలు వస్తాయనుకునేవారు. కాని తాజాగా తగిన బరువును మీరు అలసిపోయేటంతవరకు అనేక మార్లు ఎత్తుతూ వుంటే కండ తేలికగా పడుతుందని కనుగొన్నారు.
4. మీరు ఎత్తే వెయిట్ లు రిపీట్ చేయండి గాని చేసే వ్యాయామాలు రిపీట్ చేయవద్దు. కొన్ని వ్యాయామాలకు మీ కండలు తేలికగా అలవాటు పడి వుంటాయి. కనుక ప్రతి కండకు 3 వ్యాయామాలు చేస్తే చాలు. ఏ ఒక్క కండ మీద మాత్రమే ధ్యాస పెట్టవద్దు. శరీరంలోని ప్రతి కండరానికి శ్రద్ధ పెట్టండి.
5. ప్రొటీన్, పీచు కల ఆహారాలు బాగా తీసుకోండి.
6. కార్బో హైడ్రేట్లు కూడా మీ ఆహారంలో ప్రధానమే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీరు తీసుకునే ఆహారంలో 30 శాతం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుండాలి. ఇవి మీరు చేసే వ్యాయామాలకు సహకరిస్తాయి.
7. గతంలో మీరు బాడీ బిల్డర్ అయితే, కొద్దిగా తక్కువగా శ్రమించవచ్చు. మీ కండలలో గతంలోని నిర్మాణ ప్రభావం వుంటుంది. తేలికగా మరోసారి కండ పట్టేస్తుంది. ఈ రకమైన చిట్కాలతో మీ శారీరక ధారుఢ్యాన్ని తేలికగా పెంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications