Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
మందు మితంగా తాగితే.... ఆరోగ్యమే?

రమ్ - ఓల్డ్ మాంక్ లేదా కాంటెస్సా వంటివి మందు ప్రియులు మహా ఇష్టపడతారు. మన దేశ రక్షక దళాలలో రమ్ నేటికి అధికంగా అమ్మకాలు సాగించే పానీయం. రమ్, బ్రాందీ, షాంపేన్ వంటి వాటిని ఔషధాలుగా నేటికి బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ 1949 క్రింద గుర్తిస్తూనే వున్నారు. రమ్ ను కొద్దిపాటి గోరు వెచ్చని నీటితో, కొద్ది చుక్కల తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా చెప్పవచ్చు. తేనె కలిపినందువలన దాని ఘాటైన వాసన తగ్గుతుంది.
బీర్ - బీర్ అందరికి ప్రయోజనకరమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు పైపడకుండా చేస్తాయి. విటమిన్ బి 6 గుండె సంబంధిత రోగాలను తగ్గిస్తుంది. బీర్ కేన్సర్ కణాలతో పోరాడుతుంది. బీర్ ఎంత నల్లగా ఎంత చేదుగా వుంటే అంత మంచిది. బీర్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. మంచి నిద్ర, మూత్రం కలిగిస్తుంది. కిడ్నీలలోని రాళ్ళను కరిగిస్తుంది. తాజా సర్వేల మేరకు యూరప్ లో బీర్ అధికంగా అమ్మకాలు సాగిస్తోంది. బీర్ తో కడిగేస్తే వెంట్రుకలు నిగనిగ లాడి కురుల సౌందర్యం ఏర్పడుతుంది.
బ్రాందీ - ఈ మత్తు పానీయం గురించి మీ తాత ముత్తాతలనడిగినప్పటికి దగ్గు, జలుబు, కఫం వంటివాటి నివారణకు బ్రాందీ ఎంత మంచిదో చెపుతారు. ఒక్క స్పూన్ తాగినా చాలు, గొంతు నొప్పి మాయమవుతుంది. బ్రాందీ వాసన కారణంగా తాగలేకుంటే, దానిలో కొద్దిగా వేడినీరు కలిపి తాగండి. పంటి నొప్పుల వంటివి బ్రాందీలో ఒక కాటన్ ముక్క ముంచి పంటిలో పెడితే నొప్పి లాగేస్తుంది.
విస్కీ - చలికాలం వచ్చిందంటే...విస్కీ అమ్మకాలు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి, తేనె, నిమ్మరసం, వేడినీరు తో కలిపి విస్కీ ఒక ఔన్సు తీసుకుంటే రోజంతా మీకు రోగనిరోధక శక్తినిస్తుంది. విస్కీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి.
రెడ్ వైన్ - రెడ్ వైన్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. కేన్సర్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. రోగ నిరోధకతనిస్తుంది. రెడ్ వైన్ రోజుకు 30 మి.లీ. తీసుకుంటే గుండెకు కూడా మంచిది. రెడ్ వైన్ లో వుండే రిసర్వేటల్ అనే పదార్ధం రక్తనాళాలలోని అడ్డంకులను తగ్గించటంలో, పొత్తి కడుపు భాగంలోని కొవ్వు నిల్వలను కరిగించటంలో బాగా ప్రయోజనకారి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications