Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అద్భుత ఫలితాల ఔషధం అలోవెరా!

ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా అలో వెరా జ్యూస్ తాగితే, అలసట శక్తీహీనత వంటివి కూడా మాయమై, మంచి బలంగా కూడా వుంటుంది. శరీర బరువు కూడా సమంగా వుంటుంది. రోగనిరోధక వ్యవస్ధను బలపరచి రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది.
వయసు పైబడినవారికి సైతం, శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది. కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది.
అలోవెరా రసాన్ని కనుక తాగితే, పేగులలో ఏర్పడిన మంటను అది తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలం పేగును శుభ్రపరచి మలబద్ధకం ఏర్పడకుండా చేస్తుంది. గుండె మంట తగ్గిస్తుంది. ఆహారం జీర్ణం అవటానికి పొట్టలో ఏర్పడే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. అంతేకాదు, అల్లోవెరా రసాన్ని కడుపులో ఏర్పడే పెప్టిక్ అల్సర్ వంటివాటికి కూడా మంచి మందుగా వాడతారు.
అలోవెరా రసం రెగ్యులర్ గా తాగుతూంటే, చర్మ సంబంధిత అలర్జీలు లేదా ఇతర అలర్జీలు దూరం అవుతాయి. అలోవెరా రసాన్ని కొన్ని రకాల కేన్సర్ నివారణలో తయారుచేసే మందుల తయారీలో కూడా వాడతారు. అలోవెరా హాని కలిగించే బాక్టీరియాను సమర్ధవంతంగా నిర్మూలిస్తుంది. చర్మంలోకి చొచ్చుకుపోకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications