Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
వానలు పడినా...వరాల జల్లే...!

వర్షా కాలంలో ఆరోగ్యంగా వుండేందుకు చిట్కాలు
చల్లటి నీరు - వేసవిలో ఫ్రిజ్ తెరచి చల్లని నీరు తాగెయ్యటం అలవాటు పడి వుంటారు. కాని ఇపుడు మీరు ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. కొన్ని సార్లు దాహం వేస్తుంది. కాని చల్లటి నీరు తాగవద్దు. వర్షాకాలంలో చల్లటి నీరు జలుబు త్వరగా తెప్పించే అవకాశాలుంటాయి. కనుక కూల్ డ్రింక్ లు, చల్లటినీరు తాగకండి. వేసవి కాదని గుర్తించండి. శరీరాన్ని సర్దుబాటు చేయండి.
మీ నాలుకను నియంత్రించండి. వర్షాకాలంలో, డెంగు, మలేరియా వంటి వ్యాధులు వస్తూంటాయి. అంతా తడి తడి, దోమల సంగీతం, బాక్టీరియా, బాగా పెరిగిపోతూంటాయి. బజార్లలో చూసే ఆహారాలు మిమ్మల్ని తినేయమంటాయి. కాని మీరు మీ నాలుకను బజారు ఆహారాల జోలికి పోకుండా నియంత్రించండి. కొనుగోలు చేసే కూరలు, పెరుగు, వంటివి కూడా ఆరోగ్యకర ప్రదేశాలలో కొనండి. ఈ జాగ్రత్తలు మీరు జబ్బుపడకుండా చేస్తాయి.
వ్యక్తిగత ఆరోగ్యం - శరీరం వ్యాధులకు కూడా గురవుతూంటుంది. వర్షాకాలంలో, మీ పాదాలు తడిగా వుండి బాక్టీరియా శరీరంలోకి కూడా ప్రవేశిస్తుంది. గోళ్ళు ఎప్పటికపుడు కత్తిరించాలి. పాదాలు శుభ్రంగా కడుగుకోవాలి. తల వర్షంలో తడిసినపుడు బాగా కడిగి పొడిగా తుడవాలి. మీ షూస్, చెప్పులు వంటివి ఎండలో వుంచి వాటి క్రిములు పోయేలా చూడండి. ప్రతిరోజూ ఐరన్ చేసిన పొడి బట్టలు ధరించండి.
వేడినీటి స్నానం - చల్లని నీటిని స్నానం చేస్తే, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు మెండుగా వుంటాయి. ఇంటి కిటికీలనుండి చల్లటి గాలి వస్తూంటుంది. కనుక గోరు వెచ్చగా వుండే నీరు శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేడి నీటిలో క్రిములు కూడా బాగా సంహరించబడి ఆరోగ్యం చేకూరుతుంది.
వర్షా కాలంలో ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తపడుతూ, ఆనందించేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications