Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
తక్కువ ఆహారంతో ఎక్కువ ఆరోగ్యం?

మీరు చేసే డైటింగ్ మంచి ఫలితాలనివ్వాలంటే కొన్ని ఆహార నియమాలు చూడండి. అసలు మీరు డైటింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనికి జవాబు మీరు గ్రహించడం ఒక మంచి టిప్ కాగలదు. బరువు తగ్గాలా? సన్నబడాలా? లేక శారీరక వ్యాధులనుండి రక్షణ పొందటానికా లేక గుండె పోట్లు, హార్టు బ్లాకేజీలు రాకుండా కాపాడుకోడానికా? ఈ సమాచారం ఏదైనప్పటికి, కఠోరమైన మీ ఆహార నియమావళి ఏదైనప్పటికి మేము ఇచ్చే అదనపు సమాచారాన్ని పరిశీలించండి.
అధికంగా నమలటం, తక్కువమొత్తంలో ఆహారం తినటం చేయండి. సరి అయిన పోషక పదార్ధాలను కావలసిన పరిమాణంలో మాత్రమే తీసుకోండి. అతి తక్కువ తీసుకుంటే బలహీనం, జీర్ణవ్యవస్ధకు హాని కలుగుతాయి. ప్రొటీన్లు అధికంగా కల పచ్చటి ఆకు కూరలు, పండ్లు తీసుకోండి. తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు కాల్షియం బాగా ఇచ్చేవి తీసుకోండి. నీరు అధికంగా తాగండి. పోషకాహారాలు తీసుకోవడమే కాదు. శరీరం ఎల్లపుడూ నీటితో కూడా నిండివుండాలి. పొట్ట భర్తీగా వుండటంలచే మీ ఆకలి కూడా నియంత్రించబడుతుంది. భోజనం అయిన గంట తర్వాత వేడి నీరు తాగండి. అనవసరమైన కేలరీలు ఖర్చు అయిపోతాయి. అన్నిటికంటే ప్రధానమైంది, మీరు ఏ ఆహారం తిన్నప్పటికి వెంటనే నీరు తాగవద్దు. సరిగ్గా గంట తర్వాత తాగండి. దాహమనిపిస్తే కొద్ది నీరు మాత్రమే తీసుకోండి.
ఆహారం సరియైనది కాకున్నా మీకు ఇష్టం అనిపిస్తే వారానికోసారి తినటం హాని కలిగించదు. మీ కిష్టమైన మసాలాలు, ఇతర రుచులతో, రుచికరమైన ఆహారాన్ని భుజించి మానసిక తృప్తి పొందండి. ఈ చర్య మీరు అధికంగా తినటాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు మీ డైటింగ్ ఆహారానికి అపుడపుడూ కొద్దిపాటి రుచిని అందిస్తుంది. బాదం పప్పులు, పిస్తాలు, మొదలైన ఎండు ఫలాలను తినండి. పప్పులలో కేలరీలు వుంటాయనే అపోహను పక్కన పెట్టండి. అది నిజం కాదు. ఇవి మీకు విటమిన్లను, ప్రొటీన్లను అందించి శక్తినిస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి. ఎపుడు ఆకలి అయినా కొన్ని పప్పులు తినండి. మీ కిష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయకండి. అయితే, వాటి పరిమాణం తగ్గించండి. ఒక చాక్లెట్ బాక్స్ కొనేబదులుగా ఒక చిన్న చాక్లెట్ చప్పరించేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications