Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పండు ఒకటి....ప్రయోజనాలెన్నో?

యాంటీ ఆక్సిడెంట్లు - టమాటాలలో బేటా కెరోటిన్ వుండటం చేత విటమిన్లు ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి. రక్తంలో వుండే మలినాలను తొలగిస్తాయి. వీటిలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రధానం అయినది. దీనికారణంగానే పండు ఎర్రగా కనపడుతుంది. ఈ పండు మనలోని కణాలు దెబ్బతినకుండా చేస్తుంది. అయితే, దీనిని వండితే, ఇందులోని విటమిన్ సి పోతుంది. కనుక దీనివలన ప్రయోజనం అధికంగా రావాలంటే, ఎలా వున్నదాన్ని అలా తినేయాలి. కనుక మీ టిఫిన్ బాక్స్ లో టమాటా, కీర దోస ముక్కలు తప్పక వుంచుకోండి.
కంటి చూపు - టమాటాలో విటమిన్ ఎ వుండటం చేత కంటి చూపు మెరుగుపడుతుంది. త్వరగా నైట్ బ్లైండ్ నెస్ లేదా రేచీకటి రాకుండా చేస్తుంది.
కేన్సర్ - టమాటాలో వుండే లైకోపెన్ కారణంగా పురుషులలో ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా చేస్తుంది. పొట్ట లేదా పెద్ద పేగు కేన్సర్ వంటివి కూడా అరికడుతుంది. కేన్సర్ సెల్స్ వ్యాప్తిని లైకోపెన్ అరికడుతుంది. అయితే, విటమిన్ సి వద్దనుకుంటే వీటిని బాగా ఉడికించి తింటే లైకోపెన్ మరింత అధికంగా మీకందుతుంది. కనుక టమాటా సూప్....ఆనందంగా తాగేయండి.
గుండె జబ్బులు? - వీటిలో వుండే పొటాషియం, విటమిన్ బి రక్తపోటు తగ్గిస్తుంది కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది. గుండె జబ్బులు వంటివిరాకుండా కాపాడుతుంది.
చర్మ సంరక్షణ - చర్మ సంరక్షణ కొరకు టమాట తినవచ్చు. పండును గుజ్జు చేసి చర్మానికి రాసుకోవచ్చు. పది నిమిషాలు వుంచి కడిగేస్తే చర్మం శుభ్రపడి మెరిసిపోతూంటుంది.
కేశాలు - టమాటాలలో వుండే విటమిన్ ఎ మీ జుట్టును ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. కండ్లకు మంచిది, పళ్ళకు, చర్మానికి, ఎముకలకు కూడా మంచి పోషణనిస్తుంది.
ఎముకలు - టమాటాలలో వుండే విటమిన్ కె మరియు కాల్షియం, ఎముకలను బలపరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications