Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
పొట్ట నియంత్రణకు సులభ వ్యాయామాలు!

సైకిలింగ్ - మీ పొట్టకు సిక్స్ ప్యాక్ రావాలంటే ఇది మంచి వ్యాయామం. వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. ఎడమ మోకాలు వంచి పక్కకు తిరగండి కుడి మోచేయి ఎడమ మోకాలుకు కలపండి. కుడి మోకాలు తిన్నగా వుండాలి. ఇదే మాదిరిగా కుడివేపు భాగానికి చేయండి. ఈ సైకిలింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.
ఛైర్ పొజిషన్ - తిన్నగా నిలబడండి. పొట్ట వంగేవరకు మోకాళ్ళు వంచండి. మీ చేతులు ముందుకు చాచండి 1 నుండి 2 నిమిషాలు గాలి బిగబట్టి అలాగు వుండండి, సాధారణ స్ధితికి చేరి గాలి వదలండి. దీనిని పది సార్లు చేయండి.
పుల్ అప్స్ - వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. శరీర పైభాగాన్ని పైకి లేపండి. మోకాళ్ళు 4 నుండి 5 అంగుళాలు నేలనుండి పైకి లేవాలి. ఈ పొజిషన్ 2 నుండి 3 నిమిషాలుంచండి.
కాలి వ్యాయామం - వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను తిన్నగా క్రాస్ చేస్తూ పైకి లేపండి. చేతులు తలవెనుక పెట్టండి. మెడను ముందుకు లాగవద్దు. ఈ పొజిషన్ ఒక్క నిమిషముంచి రిలాక్స్ అవండి. 10 నుండి 15 సార్లు చేయాలి.
చేతుల వ్యాయామం - వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళు వంచండి. చేతులు తలవెనుక పెట్టండి. పైకి శరీరాన్ని లాగండి. ఈ పొజిషన్ లో ఒక్క నిమిషం వుండండి. మెడ నొప్పి పెడితే ఒక చేయి మెడకు సపోర్టుగా ఇవ్వండి. దీనిని 8 నుండి 10 సార్లు చేయండి
ఈ పొట్ట వ్యాయామాలు పురుషులు రెగ్యులర్ గా ఇంటివద్ద ప్రతిరోజూ చేస్తే, కండలు తిరిగే ఆకర్షణీయమైన శరీరంతో పాటు సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్ట సొంతమవుతుంది. వయసుపైబడి కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టే వారు వైద్యుల సలహాతో తగిన వైద్య పరీక్షల తర్వాత మొదలుపెట్టాలి. ప్రతిరోజూ చేసే వ్యాయామం మీలో ఆకలి కలిగిస్తుంది. మీకు ఎంతో ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications