Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆల్కహాల్ తాగకుండా మానాలంటే?

సాధారణంగా ఆల్కహాల్ మానేయాలనుకునేవారు తీపి ఆహారం కొరకు చూస్తారు. ఆల్కహాల్ లో రిఫైన్ షుగర్ వుంటుంది. అది రక్తంలో కలిసి మీ బ్లడ్ షుగర్ పెంచుతుంది. ఆల్కహాల్ వదలివేసినపుడు షుగర్ శరీరంలో తగ్గినపుడు మీకు స్వీట్ కావాలనిపించి ఆ భావన తలనొప్పి, డిప్రెషన్ కలిగిస్తుంది.
ఈ భావనను దూరం చేయటానికిగాను సహజ తీపి పదార్ధాలైన ఖర్జూరం, తేనె, కిస్ మిస్ పండ్లు మొదలైనవి తినండి.
ఆల్కహాల్ మానివేయాలనుకునేవారికి విటమిన్లు అవసరం. అవి మీలో తగ్గిన షుగర్ ప్రభావాన్ని అరికడతాయి. అందుకుగాను విటమిన్ ఇ, బి, క్రోమియం, జిన్ సెంగ్ తీసుకోండి. కొన్ని ఔషధ మూలికలైన దాల్ిన చెక్క, ధనియాలు కూడా తినవచ్చు. మిరియం అధికంగా వాడండి. గుడ్లు, పచ్చని ఆకు కూరలు, పౌల్ట్రీ మరియు మాంస ఉత్పత్తులు తినండి. వీటిలో విటమిన్ బి వుంటుంది. క్రోమియం అధికంగా వుండే టమాటాలు, ఉల్లిపాయలు, గింజధాన్యాలు తినండి. ఆల్కహాల్ మానేయాలనుకునేవారికి మరో మంచి సాధనం 8 నుండి 10 గ్లాసుల నీరు ప్రతిరోజూ తాగడం. దీని వలన ఆరోగ్యం కూడా చేకూరుతుంది.
ఆల్కహాలు మానేయటానికి ఇతర మార్గాలు పరిశీలిస్తే, ఆల్కహాల్ ఎట్టిపరిస్ధితులలోను ఇంటిలో వుంచుకోకండి. అది కనపడకుండా వుంటే మీ ధ్యాస కూడా దాని పైకి పోకుండా వుంటుంది. బదులుగా సహజ పండ్ల రసాల వంటివి ఇంటిలో వుంటే అవి తాగాలనిపించి అయినా సరే మీరు వాటికి అలవాటు పడే అవకాశం వుంటుంది. ఆల్కహాల్ మానటం ద్వారా మీరు కోల్పోయిన ఆనందం మళ్ళించబడి సహజ ఆరోగ్యానికి దోవతీస్తుంది. ఆల్కహాల్ మానేస్తున్నానన్న బెంగ దగ్గరకు చేరనీయకండి. ప్రతిరోజూ తినే ఆహారాన్ని తినటం మానకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications