Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పిల్లలకు కాల్షియం ఆహారాల ఆవశ్యకత ఎంత?

నేటి రోజుల్లో చాలామంది పిల్లలు, కాల్షియం అధికంగా వున్న పాల కంటే కూడా సోడాలు, కూల్ డ్రింక్ లు అధికంగా తాగుతున్నారు. మరి ఈ రకంగా సోడా, కూల్ డ్రింకులు, కాఫీ వంటి పానీయాలు తాగే పిల్లలకు శరీరంలో కాల్షియం తక్కువగా వుంటుంది. వారు తాగే ఇతర పానీయాలు వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. అయితే, ప్రతి దశలోను అంటే శిశువు నుండి టీనేజ్ వరకు ప్రధానమైన కాల్షియం పదార్ధాన్ని వీరు ఆహారంలో కోల్పోతున్నారు.
అసలు కాల్షియం వీరి ఎదుగుదలకు అవసరమా? అనేది పరిశీలిస్తే, బలమైన ఎముకలు నిర్మించటానికి గాను బాల్య దశనుండి టీనేజ్ వరకు శరీరంలో వున్న కాల్షియం ఉపయోగపడుతుంది. యుక్త వయసు వచ్చే సరికి శరీరంలో కాల్షియం అయిపోయి, ఎముకలలో పటుత్వం చిన్న వయసులోనే తగ్గుతుంది. వయసు పెరిగే కొద్ది ప్రత్యేకించి మహిళలలో కాల్షియం లోపం బాగా కనపడుతుంది. క్రమేణా ఈ వయసు దశలో ఆడపిల్లలు ఎముకల అరుగుదలకు అంటే ఆస్టియోపోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. బలహీనమైన ఎముకలు వారికి విరిగిపోతున్నాయి.
చిన్న పిల్లలు, శిశువులు తగినంత కాల్షియం, విటమిన్ డి లేక రికెట్స్ వ్యాధికి కూడా గురవుతున్నారు. రికెట్స్ అంటే ఎముకలు మెత్తబడిపోయే వ్యాధి. కాళ్ళు వంకర పోవటం, ఎదుగుదల లేకపోవటం, కొన్ని సార్లు కండరాల నొప్పులు బలహీనతలు కూడా కలుగుతాయి. పిల్లలలో ప్రతిరోజూ కాల్షియం 1 నుండి 3 సంవత్సరాల వయసులో 700 మి. గ్రా, 4 నుండి 8 సంవత్సరాల వయసులో 1000 మి. గ్రా. 9 నుండి 18 సంవత్సరాల వయసులో 1,300 మి.గ్రా. గా వుంటుందని ఈ మొత్తాలలో వారికి కాల్షియం లభించకపోతే, ఎదుగుదల సమస్యలు వస్తాయి కనుక డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యం చేయిస్తే, వారిలో సమస్యలు రాకపోవటమే కాక, ఎదుగుదల కూడా బాగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications