Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
బరువు తగ్గాలనుకునే శాకాహారులు ఏం చేయాలి?

శాకాహారం పట్ల కొన్ని వాస్తవాలు -
1. పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి మీ ఆహారంలో రెగ్యులర్ గా చేరిస్తే, మీరు ఆరోగ్యకరంగానే కాదు. సన్నగా, నాజూకుగా కూడా ఉంటారు. అంతేకాదు, జంతు సంబంధిత రోగాలైన బర్డ్ ఫ్లూ, టేప్ వర్మ్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
2. మాంసాహారులకంటే కూడా శాకాహారులు చాలా సన్నగా వుంటారని గమనించవచ్చు. అంతమాత్రం చేత శాకాహారం బరువు తగ్గించేస్తుందని కాదు. అయితే, పచ్చటి కూరలు, పండ్లు వంటివి తప్పక మిమ్మల్ని స్మార్ట్ గా వుంచుతాయి.
3. పండ్లు, కూరగాయలలో అధిక నీరు వుంటుంది. ఇవి మీకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కనుక అవి మీకు చాలా సేపు కడుపు నిండుగా వుండేలా అనిపిస్తాయి. ఫలితంగా మీరు తక్కువ తినటానికి ఇష్టపడతారు. కొద్ది, కొద్దిగా ఆహారం తీసుకోవటం కూడా డైటింగ్ చేసే వారికి బాగా పనిచేస్తుంది.
4. మీరు కనుక బరువు తగ్గటానికి శాకాహారం ఎంపిక చేసుకుంటే, అది మీకు సంతులిత ఆహారం అంటే అన్ని పోషకాలు కల ఆహారంగా వుండాలి. మీరు జంతు సంబంధిత ఆహారాలు తీసుకోరు కనుక, మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుండాలి. అందుకుగాను, గింజలు, పాలు, ఇతర డైరీ ఉత్పత్తులు తినండి. మీరు కనుక శాకాహారంలో ప్రొటీన్లు చేర్చకుంటే, మాంసాహారంలో వుండే ఈ పోషకాలు మీరు కోల్పోతారు. అపుడు మీకు నష్టం వాటిల్లి బరువు అతి వేగంగా కోల్పోతారు. అతి వేగంగా బరువు తగ్గటం కూడా మీకు నష్టమే.
5. ఒక ఆహారం మంచిదా కాదా అని నిర్ధారించటానికి దానిని వండే పద్ధతులు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఆహారం వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ ఏది అయినప్పటికి, దానిని బాగా నూనెలలో వేయించడం, తీపి అధికంగా జత చేయడం లేదా ఉప్పు, మసాలాలు వేయటం వంటివి మీకు తప్పక బరువు కలిగించేవిగా ఉంటాయి.
6. జంక్ ఆహారాలు ఎంతో హాని కలిగిస్తాయి. అవి ఆరోగ్యానికి హాని కలిగించటమే కాదు. మీ బరువును కూడా పెంచుతాయి. నూనెలలో బాగా వేయించిన పొటాటో చిప్స్, ఇతర బేకరీ ఆహారాలు మీకు అధిక కేలరీలనిస్తాయి. మీరు కనుక శాకాహారంతో బరువు తగ్గాలనుకుంటే, బేకరీ ఆహారాలు, జంక్ ఫుడ్ వంటివి కూడా తినరాదు. అపుడు మీకు శాకాహారం తప్పక పనిచేస్తుంది.
నేడు మనం గమనిస్తున్న వారిలో చాలామంది సెలిబ్రటీలు శాకాహారం గొప్పతనాన్ని గుర్తించి, దానికి బాగా అలవాటు పడి తమ శరీర సౌష్టవాలను అందంగా ఉంచుకుంటున్నారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు శాకాహారంలో కూడా తగిన మంచి ఆహారాలను, సరైన విధానంగా చేసే వంటకాలను మాత్రమే తింటే అది వారి బరువు తగ్గే ప్రణాళికకు బాగా సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications