Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
అధిక బరువుకు కారణం అవసరంలేని తిండి?

ఈ రకంగా తినేదానిపై ధ్యాస లేకుండా తింటే అధిక కేలరీలు కల ఆహారాలు ఎక్కువ మొత్తంలో తక్కువ వ్యవధిలో తీసుకుంటారు (ఒక్కొక్కపుడు 8 వేలనుండి 10 వేల కేలరీలవరకు కూడా తినేస్తారని డా. క్రిష్ణన్ చెపుతారు. దీని ప్రభావంగా లావెక్కుతారు. . అధిక షుగర్, పిండిపదార్ధాలు నిలబడటం వంటివి జీవప్రక్రియను మారుస్తాయి. ఫలితంగా శరీరంలో షుగర్ లెవెల్స్ మారుతూంటాయి. పురుషులకంటే కూడా మహిళలు ఈ రకమైన ఆవేశపూరిత తిండ్లు అధికంగా తింటున్నారట. దానితో లావెక్కటం, లావెక్కామన్న ఆందోళన, మానసిక వేదన, గుండె సంబంధిత వ్యాధులు కూడా తెచ్చుకుంటున్నట్లు పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
ఆహారం తింటే హాయిగా వుండే భావన కలగాలి. కాని ప్రస్తుతం తినేవారు, ఆందోళన, తప్పు చేశామన్న ఫీలింగు, ద్వేషం, మానసిక వేదనలతో భుజిస్తున్నారు. అవన్ని వున్నప్పటికి వాటిని సరి చేసుకుని తినటం ప్రధానమంటున్నారు నిపుణులు. ఆకలి లేనపుడు, అప్ సెట్ అయినపుడు భాగస్వామితో మాటలు సరిగా లేనపుడు తినవద్దు. ఆ సమయంలో తీసుకునే ఆహారం మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. సరిగా జీర్ణం కాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినాలంటే, తినే పదార్ధాలపై మనసు పెట్టాలి. అపుడే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
ఆకలి లేకుండానే తినే ఆహారం శారీరక, మానసిక ఒత్తిడికి దోవతీస్తుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే పోషకాహార లేమి సంబంధిత వ్యాధులు వస్తాయిభావావేశాలతో తినేస్తే కలిగే పరిణామాలను వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు కూడా సరి చేయలేవు. అధిక బరువు పొందటం, వ్యాధులు కలిగి వుండటం వాటికి ఆహార, వ్యాయామ నిపుణుల వద్దకు పరుగులు పెట్టేకంటే, చక్కని మానసిక వైద్యుడి సలహాలు పొందటం మంచిదని కూడా వీరు తెలియజేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications