Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మీ జీర్ణక్రియ మెరుగుపరచే వ్యాయామం!

జీర్ణక్రియ మెరుగుదలకు చేసే వ్యాయామాలు -
నడక - మీరు అధికంగా తింటే, వెంటనే నడక చేయండి. నడక జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది. భోజనం అధికంగా చేసినట్లయితే, మెల్లగా నడవండి. ఈ చర్య మీ ఆహారం జీర్ణం చేయటమే కాదు, కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది.
మెలికలు తిరగండి - వీపుపై వెల్లకిలా పడుకోండి. మీ చేతులు ఇరువైపులకు చాపండి. శ్వాస గట్టిగా తీయండి మరియు వదలండి. మీ మోకాళ్ళను ఛాతీకి తగిలించండి.శరీరపై భాగం తిన్నగా ఉండేలాచూడండి.మీ మోకాళ్ళను వంచండి. మెల్లగా మీ కింది వెన్నెముకను మరియు నడుమును ఎడమవైపుకు తిప్పండి. పదినుండి 15 సెకండ్లు అలాగే వుండి ఈ సారి కుడివైపుకు చేయండి. తేలికైన ఈ వ్యాయామం ప్రతిరోజూ 5 లేదా 6 నిమిషాలపాటు చేయండి.
శ్వాస వ్యాయామం - జీర్ణక్రియ బాగుండాలంటే, శ్వాస ప్రక్రియ బాగుండాలి. ఒక ఛైర్ పై తిన్నగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా వుండి, కాళ్ళు కిందకు వేలాడాలి. గాఢంగా శ్వాస తీయండి. అయిదువరకు లెక్కించండి, రెండు మూడు సెకండ్లు ఉంచండి బయటకు పూర్తిగా శ్వాస వదిలేయండి. ఈ చర్య మీ జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటమే కాదు, మైండ్ కూడా రిలాక్స్ చేస్తుంది.
తిన్నగా వెనుకకు - నేలపై కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్ళు తిన్నగా ఉండాలి. ఇపుడు మెల్లగా మీ ఎడమ కాలు కుడి మోకాలు వద్ద పెట్టండి మీ పై శరీరం అంటే వెన్నెముక ఎడమకు తిప్పండి. శ్వాసలు గాఢంగా తీయండి. ఇదే భంగిమ కుడివైపు కూడా ఆచరించండి. గాలి పీల్చిన తర్వాత అయిదు లేదా ఆరు సెకండ్లు బిగపట్టి వుంచి వదులుతూ ఉండండి.
జీర్ణక్రియ మెరుగుపరచేందుకు ఇవి సులభ వ్యాయామాలు. ఈ వ్యాయామాలే కాక, మరికొన్ని అంశాలు గుర్తు పెట్టుకోండి.
కూల్ డ్రింక్ లు వదలండి - చల్లని పానీయాలు జీర్ణ వ్యవస్ధను మందగిస్తాయి. కనుక సోడా, చల్లని డ్రింకులు తాగకండి. అవి మీ జీర్ణ క్రియను మెరుగు పరచవు.
యాపిల్ సైడర్ వినేగర్ -జీర్ణక్రియకు ఇది సహజ పానీయం. ఏదేని పండ్ల రసానికి యాపిల్ సైడర్ వినేగర్ కలపండి. ఖాళీ పొట్టతో ప్రతిరోజూ తాగండి.
లైట్ ఫుడ్ - ఆహారం మితంగా తీసుకోండి. అధికంగా తీసుకుంటే అది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అధిక ఆహారం జీర్ణం అవటం కష్టం అనిపిస్తే, అధికంగా తినకండి. అది జీర్ణక్రియను నెమ్మదించటమే కాదు. మీ శరీరంలో కొవ్వు చేరుస్తుంది కూడాను.
ఉసిరి - జీర్ణ క్రియను పెంచేందుకు ఉసిరికాయను వాడవచ్చు. ఉసిరికాయ తిని, వేడినీరు తాగితే, ఎటువంటి జీర్ణక్రియ సమస్య అయినే వేగంగా పరిష్కారమవుతుంది. ఉసిరిలో పీచు ఉంటుంది. అది మీరు తినిన ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తుంది.
యోగ సాధన చేయండి - యోగ సాధన జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పద్మాసనం లేదా వజ్రాసనం వంటివి వేసి ప్రాణాయామం చేస్తే, మీ జీర్ణ వ్యవస్ధకు ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications