Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
లవ్ హేండిల్స్ నియంత్రించటం ఎలా?

అయితే, ఈ లవ్ హేండిల్స్ తో జీవితం అంతా గడపాల్సిన పనిలేదని గ్రహించండి. వాటిని కరిగించేయవచ్చు. అయితే, కొంచెం శ్రమించాలి. దానికి కారణం మీరు వాటిని కదిలించలేరు. వాటి వరకే వ్యాయామం కల్పించలేరు. లవ్ హేండిల్స్ పోగొట్టుకోవాలంటే, కొన్ని నిర్దేశిత వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చేయటం వలన మీ శరీరంలో ఏర్పడిన అధిక కొవ్వును కరిగించి, మరోమారు మీరు ఆనందంగా మీ శరీర వంపు సొంపులను నలుగురిలో ప్రదర్శించుతూ ఆనందించవచ్చు.
వ్యాయామాలతో మీ లవ్ హేండిల్స్ లేదా నడుం టైర్లు మాయం చేయండి....శరీర పక్క భాగాలుకు వ్యాయామాలు చేయించాలి. ఇది వినటానికి తేలికే. కాని ఆచరణలో కొంచెం కష్టమే. తిన్నగా నిలబడండి. కాళ్ళు బా వెడం చేయండి. ఎడమవైపుకు వంగండి మీ కుడి చేయిని మీ తలమీదుగా పైకి లేపండి. ఈ భంగిమను కనీసం 30 సెకండ్లపాటు అలానే వుంచండి. తర్వాతి భంగిమగా రెండవ వైపుకు వంగండి. మీ రెండో చేతిని ఈ సారి తలపైకి ఎత్తి బేలన్స్ చేస్తూ నిలబడాలి.
పొట్ట వ్యాయామాలు - లవ్ హేండిల్స్ ను కరిగించటానికి ఈ వ్యాయామాలు బాగా పని చేస్తాయి. ఒక చాపపై పడుకోండి. తలవెనుక చేతులుపెట్టి వెల్లకిలా పడుకోండి. పొట్టను 45 డిగ్రీల యాంగిల్ లో వంచి పైకి లేవండి. ముందుగా ఎడమకు వంగండి, నార్మల్ పొజిషన్ కు రండి. తర్వత కుడివైపుకు వంగండి మరల నార్మల్ పొజిషన్ కు రండి. ప్రతివైపు వంగినపుడు ఒకటినుండి పది వరకు అదే భంగిమలో లెక్కించండి.
నడుము తిప్పుట - నడుమును అటూ ఇటూ తిప్పండి. ఇది ఎంతో తేలిక అనిపించినప్పటికి చాలా బాగా పని చేస్తుంది. మీ పొట్ట లోపలికి పోయే వ్యాయామమని అందరూ భావిస్తారు. కాని మీకుగల టైర్లను ఇది పోగొడుతుంది. తిన్నగా నిలబడండి. కాళ్ళు వెడల్పు చేయండి. ఎడమ చేత్తో మోకాళ్ళు వంచకుండా కుడి కాలిపాదం పట్టుకోండి. పది సెకండ్లు వుండండి. ఇపుడు కుడి చేత్తో మోకాళ్ళు వంచకుండా ఎడమ కాలిపాదం పట్టుకోండి.
పుష్ అప్ లు తీయుట - ఇవి కొంచెం కష్టమైనవి కాని మీ బరువు అతి త్రవరగా తగ్గిస్తాయి. ఒక చేతిపై బ్యాలన్స్ చేస్తూ కాళ్ళను మెలివేయటం ద్వారా మీ శరీరాన్ని తిప్పవలసి వుంటుంది. మరో చేయి బేలన్స్ కొరకు తలపైకి పెట్టండి. ఈ పొజిషన్ లో పుష్ అప్ లు చేయండి.
లవ్ హేండిల్స్ ఇక నాకొద్దు బాబూ అనుకుంటే తప్ప ఈ వ్యాయామాలు మీ శరీర ఆకారాన్ని తప్పక మార్చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications