Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
యోగా చేస్తే అజీర్ణం ఆమడ దూరం!

మరి జీర్ణక్రియను మెరుగుపరచే వ్యాయామాలు పరిశీలించండి.
నడక - మీరు బాగా తిన్నపుడు, కొంత దూరం తప్పక నడవాలి. నడక మీ జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఎపుడు బాగా తినేశినప్పటికి మెల్లగా కొంతదూరం తప్పక నడవండి. ఈ నడక మీ ఆహారాన్ని జీర్ణం చేయటమే కాదు మీ శరీరం కొవ్వు నిలువచేసుకోకుండా కూడా చేస్తుంది.
మెలితిరగండి - వెల్లకిలా పరుండండి. చేతులు ఇరుపక్కలా తిన్నగా వుంచండి. గట్టిగా శ్వాస లోపలికి తీయటం, బయటకు వదలటం చేయండి. మీ మోకాళ్ళను ఛాతీకి తగిలించండి. మీ పై శరీర భాగం తిన్నగా వుండేలా చూడండి. ఇపుడు మీ శరీర కింది భాగం నడుము ఎడమకు, కుడికి తిరిగేలా చేయండి. ప్రతిరోజూ ఈ వ్యాయామం 5 లేదా 6 నిమిషాలు చేయండి.
శ్వాస తీయుట - శ్వాస తీయటం వదలటం అనేది జీర్ణక్రియను మెరుగుపరచేటందుకు మంచి వ్యాయామం. తిన్నగా కుర్చీలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టి కాళ్ళు వేలాడదీయండి. శ్వాస లోపలికి గట్టిగా పీల్చండి. అయిదు లెక్కపెట్టండి. రెండు లేదా మూడు సెకండ్లు అంటే అయిదు లెక్కించేవరకు పట్టి వుంచండి. మరల 6 లెక్కించేవరకు దానికి మెల్లగా వదిలేయండి. ఈ వ్యాయామం మీ జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటమే కాదు మీ మైండ్ కు కూడా ప్రశాంతతనిస్తుంది.
పడుకొని అటూ ఇటూ - నేలమీద కూర్చోండి. వెన్నెముక నిటారు. కాళ్ళు తిన్నగా, ఇపుడు మీ ఎడమ కాలు కుడి మోకాలి వద్దకు తీసుకురండి. శరీర పై భాగం ఎడమకు వంచండి. శ్వాస లోపలికి, బయటకు తీయండి. ప్రతి పోజిషన్ లోను పది లెక్కించండి. ఇదే మాదిరి మీ కుడికాలితో కూడా చేయండి.
సులభతరమైన ఈ వ్యాయామాలు చేసి మీ జీర్ణక్రియ మెరుగుపరచుకోండి. ఈ వ్యాయామాలే కాక మరి కొన్ని అంశాలు గుర్తుంచుకోండి.
కూల్ డ్రింక్ లు తాగకండి - జీర్ణ వ్యవస్ధ ఎపుడూ బాడీ టెంపరేచర్ వద్ద బాగా పని చేస్తుంది. చల్లటి కూల్ డ్రింకులు జీర్నవ్యవస్ధను మందగిస్తాయి. కనుక జీర్ణం అవ్వాలంటూ సోడా లేదా కూల్ డ్రింక్ లు చల్లగా తాగకండి.
యాపిల్ సైడర్ వినేగర్ తీసుకోండి. సహజమైన ఈ పానీయం జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. కొద్ది చెంచాల యాపిల్ సైడర్ వినేగర్ పండ్ల రసాలకు కలిపి ఖాళీ పొట్టతో ప్రతిరోజూ తాగండి.
ఆహారం కొద్దిగా - ఆహారం అధికంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్ధ మందగిస్తుంది. కనుక కొద్దిగా తినండి. అంతేకాదు అధిక ఆహారం మీకు అధిక బరువు కూడా కలిగిస్తుంది.
ఉసిరి - ఉసిరికాయ జీర్ణం అవటానికి ఒక మంచి ఆయుర్వేదపు మందు. ఉప్పు కలిపిన ఉసిరి తిని వేడి నీరు తాగితే, అజీర్ణం గాయబ్.
యోగా చేయండి - జీర్ణక్రియ మెరుగుపడేందుకు యోగాసనాలు బాగా పనిచేస్తాయి. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తే అజీర్ణం దూరమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications