Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషుడి పొట్ట కండరాలకు వ్యాయామం!

కాలి వ్యాయామం - వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను తిన్నగా క్రాస్ చేస్తూ పైకి లేపండి. చేతులు తలవెనుక పెట్టండి. మెడను ముందుకు లాగవద్దు. ఈ పొజిషన్ ఒక్క నిమిషముంచి రిలాక్స్ అవండి. 10 నుండి 15 సార్లు చేయాలి.
ఛైర్ పొజిషన్ - తిన్నగా నిలబడండి. పొట్ట వంగేవరకు మోకాళ్ళు వంచండి. మీ చేతులు ముందుకు చాచండి 1 నుండి 2 నిమిషాలు గాలి బిగబట్టి అలాగు వుండండి, సాధారణ స్ధితికి చేరి గాలి వదలండి. దీనిని పది సార్లు చేయండి.
పుల్ అప్స్ - వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. శరీర పైభాగాన్ని పైకి లేపండి. మోకాళ్ళు 4 నుండి 5 అంగుళాలు నేలనుండి పైకి లేవాలి. ఈ పొజిషన్ 2 నుండి 3 నిమిషాలుంచండి.
చేతుల వ్యాయామం - వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళు వంచండి. చేతులు తలవెనుక పెట్టండి. పైకి శరీరాన్ని లాగండి. ఈ పొజిషన్ లో ఒక్క నిమిషం వుండండి. మెడ నొప్పి పెడితే ఒక చేయి మెడకు సపోర్టుగా ఇవ్వండి. దీనిని 8 నుండి 10 సార్లు చేయండి
సైకిలింగ్ - మీ పొట్టకు సిక్స్ ప్యాక్ రావాలంటే ఇది మంచి వ్యాయామం. వెల్లకిలా పడుకోండి. చేతులు తలకింద పెట్టండి. ఎడమ మోకాలు వంచి పక్కకు తిరగండి కుడి మోచేయి ఎడమ మోకాలుకు కలపండి. కుడి మోకాలు తిన్నగా వుండాలి. ఇదే మాదిరిగా కుడివేపు భాగానికి చేయండి. ఈ సైకిలింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.
ఈ పొట్ట వ్యాయామాలు పురుషులు రెగ్యులర్ గా ఇంటివద్ద ప్రతిరోజూ చేస్తే, కండలు తిరిగే ఆకర్షణీయమైన శరీరంతో పాటు సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్ట సొంతమవుతుంది. నేటి రోజులలో వాతావరణ కాలుష్యం అధికంగా వుంటోంది. శరీరానికి మంచి ఆహారంతో పాటు పరిశుభ్రమైన గాలి కూడా అందించాలి. అందుకుగాను ప్రాణాయామాలవంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా తప్పక చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications