Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు!

1. శారీరక వ్యాయామం - ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే, ఏదో ఒక శారీరక చర్యలలో పాల్గొనండి. అది నడక లేదా వర్కవుట్ కావచ్చు. కొంతసేపు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ లేదా మీ కిష్టమైన ఆటలాడటం చేస్తే బోర్ అనిపించకుండా వుంటుంది. శారీరక కదలిక కండరాలను వేడెక్కించి మైండ్ ను రిలాక్స్ చేస్తాయి. అయితే, ఇది అతిగా చేస్తే శరీరం నొప్పులు పెడుతుంది.
2. గాఢ శ్వాసలు తీయడం - గాఢ శ్వాసలు తీస్తే శరీరం విశ్రాంతి పొంది ప్రశాంతత పొందుతుంది. ఒత్తిడి హార్మోన్లు తొలగుతాయి. మీ పొట్టపై ధ్యాస పెట్టండి ఛాతీ కంటే కూడా పొట్ట బాగా కదలాలి. ఇది విశ్రాంతి పొందేందుకు మంచి టెక్నిక్.
3. యోగాభ్యాసం - ఒత్తిడికి గాఢ శ్వాస లేదా ఏకాగ్రత వంటివి ఎంతో మేలు చేస్తాయి. శరీరం విశ్రాంతి పొందుతుంది. శరీర భంగిమలపై ధ్యాస పెట్టండి. మెత్తటి మ్యూజిక్ లేదా డిమ్ లైట్ వంటివి యోగా సమయంలో మరింత హాయినిస్తాయి. ఇవి వ్యాయామాలు కాకపోయినప్పటికి మనస్సును ప్రశాంత పరుస్తాయి. కనుక ఆచరించవచ్చు.
4. కండరాల విశ్రాంతి - వివిధ యోగా ఇతర భంగిమలు ఆచరించటం వలన కండరాలు విశ్రాంతిని పొంది ఒత్తిడి తగ్గుతుంది. మీ కండరాలలో ఆందోళన సమసిపోతుంది. కండరాలు సడలి విశ్రాంతి పొందుతారు.
5. జాగింగ్, స్విమ్మింగ్, సైకిలింగ్, డేన్సింగ్ వంటివి కూడా ఒత్తిడిని తగ్గించే ఉపయాలే. మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలు పై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. నేటి రోజులలో ఒత్తిడి సర్వ సాధారణమైంది. కనుక ఈ సులభతర టెక్నిక్ లు ఆచరించి ఆరోగ్య ప్రయోజనం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications